Massive Security Breach in Lok Sabha : పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి నిరూపితమైంది. లోక్‌సభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన ఇద్దరు.. లోక్‌సభ ఛాంబర్‌లోకి పరుగెత్తారు. సెక్యూరిటీ సిబ్బంది వీరిని ఆపేందుకు ప్రయత్నించగా కూర్చీల పైకి దూకుతూ లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి.. తనతో తీసుకొచ్చిన టియర్ గ్యాస్ స్పేను సభలో వదిలాడు. ఇదే సమయంలో మరో యువకుడు, మహిళ కలిసి పార్లమెంటు బయట కలర్ గ్యాస్ క్యానిస్టర్‌తో స్ప్రే చేశారు..
మోదీ ‘మనీ హైస్ట్’ కామెంట్స్ కి జైరాం రమేష్ కౌంటర్..
ఈ సంఘటనకు సంబంధించిన నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ చేస్తున్నారు. 2001లో పార్లమెంట్‌పై తుపాకీలతో దాడి జరిగిన ఘటన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. పార్లమెంట్‌లోకి స్మోక్ క్యాన్స్‌తో వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? టియర్ గ్యాస్ స్ప్రేలను పోలీసుల కళ్లు గప్పి ఎలా లోపలికి తేగలిగారు? అనే విషయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చేది కష్టమే..!
ఈ సంఘటన తర్వాత దాడికి వాడిన గ్యాస్ క్యానిస్టర్స్‌ని మీడియా ప్రతినిధులు టచ్ చేస్తూ, టీవీల్లో చూపించడానికి తగువులాడడం కూడా కనిపించింది. విచారణకు సంబంధించిన అతి విలువైన ఆధారాలు, మీడియా చేతికి ఎలా ఇచ్చారు? వాటిపై పడిన నిందితుల వేలు ముద్రలను సేకరించి, ఫోరెన్సిక్ వారికి పంపించాల్సిన పోలీసులు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.