Marriage Season : అధిక ఆషాడం మాసం వల్ల ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ కూడా పెరిగింది. భారత్‌లో పెళ్లి అంటే చాలా ఖరీదైన వ్యవహరం. చుట్టాలు, కట్నాలు, కానుకలు, లాంఛనాలు, అప్పగింతలు.. ఇలా ఓ సగటు మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి అయినా కనీసం రూ.15 నుంచి రూ.20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 మధ్య 23 రోజుల గ్యాప్‌లో భారత్‌లో ఏకంగా 35 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి.
ఈ పెళ్లిళ్ల ద్వారా భారత్‌లో దాదాపు రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. ఇది ఓ రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. పెళ్లికి చేసే అధికారిక లెక్కల విలువ మాత్రమే ఇది. లెక్కల్లోకి రాని వరకట్నం, మందు సీసాల ఖర్చులు కూడా గణిస్తే ఆ బడ్జెట్, భారత దేశ అప్పులను కూడా తీర్చేసే విలువతో సమానంగా ఉంటుందేమో.
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?
వచ్చే ఏడాది మాఘమాసంలో మరో 10 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయట. అంటే వచ్చే ఆరు నెలల కాలంలో 90 లక్షల మంది వివాహం చేసుకుని, ఒక్కటి కాబోతున్నారు. దీంతో 2025-26 సీజన్‌లో భారత జనాభా మరో అర కోటి పెరగడం ఖాయం. ఇప్పటికే చైనాని దాటేసిన భారత దేశ జనాభా, త్వరలో 200 కోట్ల మార్కును అందుకోవడం కూడా ఖాయంగా మారింది.
లంగా ఓణీలలో మెరుస్తున్న సినీ పూబోణి..