Mansoor Ali Khan : ‘త్రిషను రేప్ చేయాలని అనుకున్నా’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్, తన వ్యాఖ్యలను ఇప్పటికీ సమర్ధించుకుంటున్నాడు. తాజాగా తన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హీరోయిన్ త్రిష, టాలీవుడ్ నటుడు మెగా స్టార్ చిరంజీవిపై క్రిమినల్ కేసులు పెట్టబోతున్నట్టు వెల్లడించాడు మన్సూర్ ఆలీ ఖాన్.
త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
‘నేను త్రిషతో కలిసి నటించబోతున్నా అనే విషయం తెలిసినప్పుడు, నాతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నా. తనను బెడ్ మీద రేప్ చేసే సీన్‌లో నటించవచ్చని బాగా ఆశపడ్డాను. ఇంతకుముందు చాలామంది హీరోయిన్లతో నేను రేప్ సీన్స్‌లో నటించా. నాకు ఇదేమీ కొత్త కాదు. అయితే వీళ్లేమో నాకు త్రిషను కూడా చూపించలేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు మన్సూర్ ఆలీ ఖాన్.
దీనిపై స్పందించిన త్రిష, ‘నాపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతగానో కలిచి వేశాను. అతనితో ఇంతవరకూ నటించకపోవడం నా అదృష్టం. ఇకపై కూడా నటించకుండా జాగ్రత్త పడతా. ఇలాంటి వాళ్లు మనిషి పుట్టుకకే అర్హులు కారు’ అంటూ ట్వీట్ చేసింది.
బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..
మెగాస్టార్ చిరంజీవి, త్రిషపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగినా క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడలేదు మన్సూర్ ఆలీ ఖాన్. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని వారించాడు. తాజాగా ‘నా ఇమేజ్ చెడగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై క్రిమినల్ కేసు, పరువు నష్టం కేసు పెట్టబోతున్నా.
త్రిషతో పాటు చిరంజీవి, నడియార్ సంఘం సభ్యురాలు కుష్భూకి కూడా త్వరలో లీగల్ నోటీసులు పంపబోతున్నా..’ అంటూ వ్యాఖ్యానించాడు మన్సూర్ ఆలీ ఖాన్. చూస్తుంటే నెల క్రితం విడుదలైన ‘లియో’కి కలెక్షన్లు పెంచేందుకు చేసిన పబ్లిసిటీ స్టంట్‌గా అనిపించిన ఈ ఎపిసోడ్, చాలా దూరం వెళ్లేలాగే కనిపిస్తోంది.
బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..