Manjummel boys, Ilaiyaraaja :మలయాళంలో ఓ చిన్న సినిమాగా వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తమిళనాడులో, అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ‘గుణ’ కేవ్స్‌లోకి వెళ్లి లోయలో పడిపోయిన ఓ స్నేహితుడిని బయటికి తీయడానికి అతని స్నేహితులు ఏం చేశారు? అనేది ‘మంజుమ్మల్ బాయ్స్’. కథలో భాగంగానే ‘గుణ’ సినిమాలోని పాటను ఈ సినిమా ప్రారంభంలో, క్లైమాక్స్‌లో వాడారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ హైలైట్ ఇదే..
అయితే ఇళయరాజా (ilaiyaraaja) కమర్షియల్. తాను స్వరపరిచిన సినిమాల్లో ఏ పాటను వాడినా లీగల్ నోటీసులు పంపిస్తూ, కాపీ రైట్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇళయరాజా.. రజినీకాంత్ ‘వెట్టైయన్’ మూవీ గ్లిప్స్‌లో తాను స్వరపరిచిన పాటకు సంబంధించిన చిన్న పల్లవి ఉపయోగించినందుకు వారిపైన కేసు వేశాడు ఇళయరాజా. లేటుగా మూవీ చూశాడో ఏమో కానీ ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్(manjummel boys )’ సినిమాలో ‘గుణ’ పాట పాడినందుకు వారికి కూడా లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా..
ఈ కాపీ రైట్స్ విషయంలో ఇంతకుముందు ఇళయరాజాకి, సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య ఓ కోల్డ్ వార్ జరిగింది. తాను స్వరపరిచిన పాటలను, టీవీ ప్రోగ్రామ్స్‌లో తన అనుమతి లేకుండా పాడుతున్నాడని ఎస్పీ బాలుపై కేసు వేశాడు ఇళయరాజా. ఆ సమయంలో ఎస్పీ బాలు, ‘మీరు మ్యూజిక్ ఇచ్చినందుకు నిర్మాత నుంచి డబ్బులు ఎలా తీసుకున్నారో, తాను పాడిన పాటకు కూడా డబ్బులు తీసుకున్నా.. మీ మ్యూజిక్, నా స్వరం’ అంటూ ధీటుగా బదులు ఇచ్చారు. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే ఎస్పీ బాలు తుది శ్వాస విడిచారు.