Manjummel Boys Review : మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగువాళ్లకు ఎక్కుద్దా..?

Manjummel Boys Review : ఓ చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘మంజుమ్మల్ బాయ్స్’. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్, ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. మరి మలయాళంలో ఇండస్ట్రీ హిట్టు, తమిళ్‌లో సెన్సేషనల్ హిట్టు కొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగువాళ్లకి నచ్చిందా?

ఇది ఓ యథార్థ సంఘటన ద్వారా తెరకెక్కిన సినిమా. గుణ సినిమాలో పాపులర్ అయిన గుణకేవ్స్‌లో ఓ వ్యక్తి చిక్కుకుపోతాడు. అతన్ని కాపాడేందుకు మంజుమ్మల్ బాయ్స్ అక్కడికి వెళ్లి, అతన్ని ఎలా బయటికి తీసుకొచ్చారనేదే ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా కథ. 2006లో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో, అక్కడే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది.

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్ తగ్గిందా..!?

మలయాళం సినిమాలు చూడాలంటే ఓపిక తప్పనిసరి. ఈ సినిమా కూడా అంతే. వాస్తవ సంఘటన కావడంతో రియాలిటీకి చాలా దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సిజు డేవిడ్, సుభాష్ మాత్రమే తెలుగువాళ్లకి కాస్తో కూస్తో పరిచయం ఉన్న ముఖాలు. మిగిలినవాళ్లంతా తెలుగువాళ్లకు పరిచయం లేని ముఖాలే కాబట్టి వారి పాత్రలే తెరపైన కనిపిస్తాయి. చిదంబరం దర్శకత్వం, షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్ మ్యూజిక్ ఈ సినిమాని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ సర్వైవల్ డ్రామాగా మలిచాయి. అయితే తెలుగువాళ్లకు ఈ సినిమా ఎంతవరకూ ఎక్కుతుందంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మలయాళ ప్రేక్షకులు కూర్చున్నంత ఓపికగా తెలుగువాళ్లు థియేటర్లలో కూర్చోలేరు మరి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post