Manjummel Boys Director : ఓ చిన్న సినిమాగా విడుదల అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’, మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కేరళతో పాటు తమిళనాడు, నార్త్ అమెరికాల్లో ఈ మూవీకి రికార్డు వసూళ్లు వచ్చాయి. తెలుగులో డబ్ చేసిన రిలీజ్ చేసిన ‘మంజుమ్మల్ బాయ్స్’కి మంచి రెస్పాన్సే వచ్చింది, ‘ప్రేమలు’ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది. ‘మంజుమ్మల్ బాయ్స్’ 2006లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ మూవీ రూపొందిన విషయం అందరికీ తెలుసు.
Indian 2 Movie : మళ్లీ వాయిదా పడిన ‘ఇండియన్ 2’.. రామ్ చరణ్ సినిమాపై ఎఫెక్ట్..
అయితే రియల్ లైఫ్‌లో లోయలోకి పడిపోయిన సుభాష్, ట్రిప్‌కి వెళ్లే ముందు తన తమ్ముడి బెల్ట్ తీసుకెళ్తాడు. అతన ‘నా బెల్ట్ అక్కడ పెట్టు అన్నా’ అంటే, ‘నీ బెల్ట్ నేనేమీ తినను లేరా’ అంటాడు. సినిమాలో ఈ సీన్ పెట్టడానికి ఓ కారణం ఉంది. రియల్ లైఫ్‌లో అలా తమ్ముడి దగ్గర్నుంచి తీసుకున్న బెల్ట్, లోయలో ఓ కొండకు ఇరుక్కోవడం వల్లే సుభాష్.. పూర్తిగా కిందకి జారిపోకుండా మధ్యలో ఆగిపోతాడు. అయితే సినిమాలో ఈ సీన్‌లో ఎలా చూపించాలో డైరెక్టర్‌కి అర్థం కాలేదు..
లోయలో చిమ్మచీకటి ఉంటుంది. అక్కడ అంత వేగంగా కిందకి పడిపోతూ వచ్చిన సుభాష్, బెల్ట్ కారణంగా ఓ రాయి మీద ఆగిపోయాడని చూపించడం ఎలా? ఎంత ప్రయత్నించినా తెలియకపోవడంతో దాన్ని లైట్ తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ చిదంబరం, మంజుమ్మల్ బాయ్స్ సక్సెస్ మీట్‌లో చెప్పాడు. అంతేకాదు సినిమా ఆరంభంలో మంజుమ్మల్ బాయ్స్, మరో గ్యాంగ్‌తో తాడు లాగే గేమ్ ఆడి ఓడిపోతారు. ఆ తాడు లాగే గేమ్ గెలిచే గ్యాంగే రియల్ లైఫ్ మంజుమ్మల్ బాయ్స్.