Manamey Movie Review : శర్వానంద్ కెరీర్‌లో మెసేజ్ ఓరియెంటెడ్, ఫీల్ గుడ్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ‘ఒకే ఒక్క జీవితం’ వంటి మదర్ సెంటిమెంట్ మూవీ తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకుని, ‘మనమే’ మూవీ చేశాడు శర్వానంద్. ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా, జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది ‘మనమే’.
‘మనమే’ కథ లండన్‌లో మొదలవుతుంది. హీరో, హీరోయిన్ అనుకోకుండా ఓ చిన్నారికి సంరక్షకులుగా మారాల్సి వస్తుంది. జీవితంలో దేన్నీ సీరియస్‌గా తీసుకుని హీరో, ప్రతీ విషయంలో ఎంతో కేర్ తీసుకుని పక్కాగా ఉండే అమ్మాయి మధ్య ఆ చిన్నారి వల్ల ఎలాంటి రిలేషన్ ఏర్పడింది? ఇదే సింపుల్‌గా ‘మనమే’ కథ. ఫస్టాఫ్‌లో కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయినా ఎమోషనల్ కనెక్షన్ ఉండదు.
Allu Arjun’s Sympathy Drama : సింపథీ డ్రామా షురూ….
సెకండాఫ్‌లో ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మొదటి 30 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చాలామందికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కథ ఊహించిందే అయినా శర్వానంద్ కామెడీ టైమింగ్‌కి తోడు కృతి శెట్టి పర్ఫామెన్స్ కలిసి సినిమాని ఫీల్ గుడ్ మూవీగా మార్చాయి. హేషం వాహాబ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలం..
లండన్, యూరప్‌లో సినిమా షూటింగ్ అంతా జరగడంతో ప్రతీ స్క్రీన్ రిచ్‌గా కనిపిస్తుంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈసారి కాస్త బాగానే ఇంప్రెస్ చేశాడు. ‘భలే మంచిరోజు’ తర్వాత శ్రీరామ్ ఆదిత్య నుంచి వచ్చిన బెస్ట్ మూవీగా ‘మనమే’ని చెప్పొచ్చు. ‘దేవదాస్’ మూవీలో కనెక్ట్ కాని ఎమోషన్స్, ‘మనమే’ మూవీలో కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే శర్వానంద్ కామెడీ టైమింగ్ సినిమాని నిలబెట్టింది. ఇదే ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే బొమ్మ సూపర్ హిట్టే..
Blink Movie : టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లర్ ‘బ్లింక్’.. అస్సలు మిస్ కాకండి..
ఎడిటింగ్‌లో చాలా సీన్స్ కట్ చేశారని, కాబట్టి లాజిక్ వెతక్కుండా మూవీ చూడాలని శర్వానంద్ చెప్పాడు. అయితే ఎడిటింగ్‌లో ఇంకో 20 నిమిషాలు లేపేస్తే సినిమా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండేది.. ఓవరాల్‌గా శర్వానంద్ ఫ్యాన్స్‌కి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మిగిలినవాళ్లు కూడా శర్వానంద్ కామెడీ టైమింగ్, కృతి శెట్టి పర్ఫామెన్స్, మ్యూజిక్ కోసం చూడొచ్చు..