Mamta Mohandas Strong Comments On Tollywood : కథా బలం ఉన్న సినిమాలను నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. ఈ ఏడాది ఇప్పటికే ఐదు మాలీవుడ్ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మిగిలిన సినీ ఇండస్ట్రీల కంటే ముందున్నాయి. ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’, ‘ఆవేశం’, ‘ఆడు జీవితం’ సినిమాలు కమర్షియల్ సక్సెస్‌తో పాటు క్రిటిక్స్‌ని కూడా మెప్పించాయి.
తాజాగా మలయాళ నటి మమతా మోహన్‌దాస్, సౌత్ ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్లు చేసింది. ‘హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్‌లో వర్క్ షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంటుంది. హాలీ డేస్ ఉండవు, బ్రేకులు ఉండవు. సౌత్‌లో టాలీవుడ్లోనే ఇలాంటివి ఉంటాయి. రోజుకి కొన్నిసార్లు 2,3 షాట్స్ మాత్రమే తీస్తారు. ఇలా చేయడం వల్ల బడ్జెట్ చాలా పెరుగుతుంది..
మాలీవుడ్‌లో అలా కాదు. షూటింగ్ అయిపోయేవరకూ వరుసగా షెడ్యూల్ జరుగుతూనే ఉంటుంది. రోజుకి 16 నుంచి 18 గంటల వరకూ పని చేయాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం అనే తేడా ఉండదు. షూటింగ్ అయ్యే వరకూ పనిచేయాల్సిందే.. 25 రోజుల షెడ్యూల్ వేసి, సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేస్తాం..
బడ్జెట్ తక్కువ ఉందని కాదు, బడ్జెట్‌ని అనవసరంగా పెంచడం కరెక్ట్ కాదని నమ్ముతాం. తెలుగులో 100-200 రోజులు షూటింగ్ చేస్తారు. అన్ని రోజులు షూటింగ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక్కరోజులో పూర్తి చేసే పనిని 5-6 రోజులు చేయడం దేనికి?
మాలీవుడ్‌లో సినిమాలన్నీ కూడా కథల చుట్టూనే తిరుగుతాయి. అంతేకానీ మేకింగ్‌ని పెద్దగా పట్టించుకోం. కథను చెప్పే విధంగా చెబితే జనాలకు అర్థం అవుతుంది. దానికోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మేకింగ్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్లో అలా కాదు. మరీ ముఖ్యంగా తెలుగులో కథ కంటే కూడా మేకింగ్ పైనే ఎక్కువ ఖర్చు పెడతారు.. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, అంత గొప్ప అని ఫీలవుతారు… మాకు అది అవసరం లేదనిపిస్తుంది..’ అంటూ కామెంట్ చేసింది మమతా మోహన్‌దాస్..
సింగర్‌గా ‘రాఖీ రాఖీ’తో పాటు 20కి పైగా పాటలు పాడిన మమతా మోహన్‌దాస్, ఎన్టీఆర్‌తో కలిసి ‘యమదొంగ’, నితిన్‌తో కలిసి ‘విక్టరీ’, జగపతిబాబుతో ‘హోమం’, నాగార్జునతో ‘కేడీ’, ‘కింగ్’, వెంకటేశ్‌తో ‘చింతకాయల రవి’ వంటి సినిమాల్లో నటించింది.