Malayalee from India Movie Review : నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’… దిజో జోష్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం తెలుగులో సోనీ లివ్ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోతుంది. అదే సమయంలో హీరో ఉండే ఊర్లో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు టపాకాయలు కాలుస్తారు. దీంతో హీరో స్నేహితుడు, ఆ ముస్లిం కుటుంబంపై దాడి చేస్తాడు. ఈ సంఘటన పెరిగి పెరిగి మత కలహాలకు దారి తీస్తుంది.. ఈ కేసులో సంబంధం లేకపోయినా హీరోపై కేసు నమోదు అవుతోంది.
దీంతో అతను అరబ్ దేశానికి పారిపోతాడు. అక్కడ ఓ పాకిస్తాన్ దగ్గర పనిచేయాల్సి వస్తుంది. అక్కడ హీరో ఫేస్ చేసిన కష్టాలు, పరిస్థితులు ఏంటి? ఇదే మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ కథ.. సీరియస్ కథాంశంతో చక్కని హ్యూమర్‌తో కలిపి వినోదాత్మకంగా తెరకెక్కించాడు డైరెక్టర్ దిజో జోష్ ఆంటోనీ..
PT SiR Review : మెసేజ్ ఉంది, థ్రిల్ల్ ఉంది..
పాకిస్తాన్ అంటే తీవ్రవాదులు, టెర్రరిస్టులే ఉంటారని అనుకునే అతివాదులకు ఓ సెటైరికల్ టచ్ ఇచ్చిన సినిమా ఇది.. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసే నివిన్ పౌలీ, మరోసారి తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. హీరో స్నేహితుడిగా నటించిన ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రంజన్, దీపక్ జేతి పర్ఫామెన్స్‌లు ఈ సినిమాకి హైలైట్..