Malavika Mohanan : ఎప్పటికీ యాక్టింగ్ చేయను! నీకేంటి ప్రాబ్లెమ్… నెటిజన్‌కి మాళవిక మోహనన్ కౌంటర్..

Malavika Mohanan : సినిమాల్లో ఎలా ఉన్నా, బయట ఫంక్షన్లలో కాస్త పద్ధతిగా కనిపించడం సౌత్ హీరోయన్లకు అలవాటు. అయితే దాన్ని బ్రేక్ చేసి, పార్టీలు, అవార్డు ఫంక్షన్లలో కూడా టూ హాట్ అందాలతో కనిపించి, సోషల్ మీడియాని షేక్ చేసింది మాళవిక మోహనన్. కేరళకు చెందిన మాళవిక మోహనన్, ఇప్పటిదాకా 4 మలయాళ సినిమాలు. ఓ కన్నడ సినిమా, ఓ హిందీ సినిమా చేసింది.

తమిళ్‌లో ‘పెట్టా’, ‘మాస్టర్’, ‘మారన్’ వంటి సినిమాల్లో నటించిన మాళవిక మోహనన్, విక్రమ్‌తో ‘తంగలాన్’ సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగులో ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది మాళవిక..

Jagapathi Babu : ఆ మూవీకి చాలా కష్టపడ్డా.. చివరకు జోకర్‌ని చేశారు..

‘మీరు గ్లామర్ షోస్ తగ్గించి నటించడం ఎప్పుడు మొదలెడతారు?’ అని ఓ అభిమాని, మాళవిక మోహనన్‌ని ప్రశ్నించాడు. గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లకు ఇలాంటి ప్రశ్నలు రావడం చాలా కామన్. వీటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు చాలామంది హీరోయిన్లు. అయితే మాళవిక మోహనన్ మాత్రం అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

‘నేను ఎప్పటికీ నటించను.. దాంట్లో నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?’ అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది మాళవిక మోహనన్. ఇప్పటికీ మాళవిక చేసిన సినిమాల్లో అదరగొట్టే యాక్టింగ్ రోల్స్ కనిపించకపోయినా ‘తంగలాన్’ మూవీలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగానే కనిపిస్తోంది. అలాగే ‘రాజా సాబ్’ మూవీలో మాళవిక గోస్ట్ రోల్‌లో భయపెట్టబోతుందని టాక్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post