SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

Mahesh Babu – Rajamouli : కెరీర్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ లు ఎరుగని డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. జక్కన్న బాహుబలి రెండు భాగాలతో, RRR మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. RRRతో హాలీవుడ్ లో తన పేరు మార్మోగిపోయింది. అయితే రాజమౌళి తన నెక్స్ట్ మూవీ RRRకి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రెసెంట్ గ్లోబల్ డైరెక్టర్ గా ప్రమోట్ అయిన రాజమౌళి ఇక మీదట తీసే సినిమాలన్నీ వరల్డ్ మూవీ లవర్స్ ని దృష్టిలో పెట్టుకొని తీయనున్నాడు.

క్రేజీ కాంబో.. గురూజీతో డార్లింగ్..

జక్కన్న తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB29 చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పక్కా యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాగా ఉంటుందని ఇందులో మహేష్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమెంట్స్‌ ఉంటాయని గతంలో చెప్పాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో చర్చలు జరిపినట్టు సమాచారం.

Mahesh Babu - Rajamouli

అయితే జక్కన్నతో మూవీ అంటే ఆషామాషీ విషయం కాదు.. ఆయనతో మూవీ చేసే హీరోల‌కు కండీష‌న్స్ మాములుగా ఉండవు. లుక్ బ‌య‌ట‌కు రాకూడ‌దు, ఎక్కువ‌గా ఈవెంట్స్‌కు హాజ‌రు కాకూడ‌దు. త‌న సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌కూడ‌దు ఇలా ఉంటాయి కండీష‌న్స్. అంతేనా అనుకోకండీ.. రాజమౌళి మూవీలో యాక్షన్ సీన్స్ కోసం ముందే ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఈ ట్రైనింగ్ లో ఒళ్ళు హూనమవ్వాల్సిందే..

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

బాహుబలికి ప్రభాస్, RRR కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా కష్టపడ్డ వాళ్లే.. ఇప్పుడు సూపర్ స్టార్ వంతు. SSMB29 మూవీ కోసం మహేష్ కి 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ నిర్ణయించాడట జక్కన్న. ఈ ఏడాది చివర నుంచి వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఈ ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందట. ఆలోపు మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న గుంటూరు కారంలో తన షూట్ కంప్లీట్ చేయాలని చెప్పినట్టు సమాచారం.

అందుకు తగ్గట్టే గురూజీ గుంటూరు కారం షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని సీనియర్ నిర్మాత కేఎల్. నారాయణ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. RRR కు మించి ఈ మూవీ బడ్జెట్ ఉండనుంది. ఏదేమైనా ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన సూపర్ స్టార్ SSMB29తో హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిపోవడం పక్కా అని మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post