Mahesh Babu – Puri Jagannadh : పోకిరి, బిజినెస్ మ్యాన్‌లను కలిపి మహేష్ బాబు డ్యూయెల్ రోల్..

Mahesh Babu – Puri Jagannadh : మహేష్ బాబు కెరీర్‌‌‌ని అమాంతం పైకి లేపిన సినిమా ‘పోకిరి’. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ వరుస ఫ్లాపులు ఫేస్ చేశాడు. పూరీ జగన్నాథ్‌తో చేసిన ‘బిజినెస్‌మ్యాన్’ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో సూర్య భాయ్‌గా మహేష్ నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పూరీ ఎంతో శ్రద్ధ పెట్టి, కసిగా రాసిన క్యారెక్టర్ సూర్యభాయ్..

‘బిజినెస్‌మ్యాన్’ మూవీ తర్వాత మహేష్‌తో మూడో సినిమా ప్లాన్ చేశాడు పూరీ జగన్నాథ్. ‘పోకిరి’లో మహేష్ చేసిన కృష్ణ మనోహర్ క్యారెక్టర్‌, ముంబైలో ‘బిజినెస్‌మ్యాన్’ సూర్య భాయ్‌ని కలిస్తే ఎలా ఉంటుంది? ఈ పాయింట్‌తో మహేష్- పూరీ జగన్నాథ్ కాంబోలో మూడో సినిమా రావాల్సింది. పోలీస్, మాఫియా డాన్‌‌గా మహేష్ బాబు డ్యూయెల్ రోల్ చేస్తే.. రికార్డులు షేక్ అయ్యేవి. అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు..

Pawan Kalyan : ఎలక్షన్స్ అయిపోయాయి, పవన్ కళ్యాణ్‌ షూటింగ్‌లకి వచ్చేదెప్పుడు?

పూరీ చెప్పిన లైన్, మహేష్‌కి నచ్చినా కథ మొత్తం పూర్తి అయ్యాక పెద్దగా నచ్చలేదు. అదీకాకుండా క్లైమాక్స్‌లో కృష్ణ మనోహర్, సూర్య భాయ్ ఇద్దరిలో ఒకరిని చంపేయాలి? లేదా మాఫియా డాన్ సూర్య భాయ్ మారిపోయినట్టు చూపించాలి ఈ రెండూ వర్కవుట్ కావని ఈ ప్రాజెక్ట్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు మహేష్ – పూరీ జగన్నాథ్. బాబు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుండడంతో ‘జనగణనమన’ స్టోరీ రాసుకున్నాడు పూరీ జగన్నాథ్..

ఈ కథకు మొదట మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చింది. అయితే పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో అతనితో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. ఈ సినిమాని విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నా, అది కూడా వర్కవుట్ కాలేదు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post