Mahesh Babu – Prabhas : కల్కిలోకి మహేష్ కూడా! అయితే చిన్న ట్విస్ట్..

Mahesh Babu – Prabhas : ప్రభాస్ హీరోగా వస్తున్న ‘కల్కి 2898AD’ సినిమా కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. కారణం ఇందులో ప్రభాస్‌తో పాటు ప్రత్యేక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్లు నటిస్తున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్, నాని, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ.. ఇలా ‘కల్కి’ మూవీలో నటిస్తున్నారని వార్తల్లో నిలిచిన స్టార్ల సంఖ్య చాలా పెద్దది..

Rajinikanth :రజినీకాంత్‌ని చెప్పుతో కొడతానన్న డైరెక్టర్

తాజాగా ఈ లిస్టులోకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం మహేష్, రాజమౌళితో సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మధ్యలో ‘కల్కి’ మూవీలో నటించడం కష్టమే. అయితే కనిపించకుండా, వినిపించేందుకు రెఢీ అవుతున్నాడట మహేష్. ‘కల్కి’ మూవీలో ప్రభాస్, భైరవుడిగా, కల్కి అవతారంలో, మహా విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడని టాక్..

మహా విష్ణ అవతారాన్ని పరిచయడం చేయడానికి మహేష్ బాబు, వాయిస్ ఓవర్ వాడుకోబోతున్నాడట. ఇప్పటికే మహేష్ బాబుని వాయిస్ ఓవర్ కోసం సంప్రదించాడట నాగ్ అశ్విన్. మహేష్‌కి తాను డిమాండ్ చేసిన అమౌంట్ ఇస్తే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒకే చెప్పినట్టు సమాచారం. ఇంతకుముందు ‘బాద్‌షా’, ‘జల్సా’, ‘ఆచార్య’ వంటి సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్.. అలాగే అక్క మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మనసుకి నచ్చింది’ సినిమాకి, తండ్రి కృష్ణ ప్రధాన పాత్రలో ‘శ్రీశ్రీ’ సినిమాకి కూడా వాయిస్ ఓవర్ అందించాడు మహేష్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post