Mahesh Babu : సావిత్రి తర్వాత తెలుగువారికి అంతగా చేరువైన హీరోయిన్ సౌందర్య. 1990-2000 మధ్య స్కూల్‌కి వెళ్లే ప్రతీ అమ్మాయి నోట్‌బుక్‌లో సౌందర్య ఫోటోలు ఉండేవి. మిగిలిన హీరోయిన్లలా ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా, పద్ధతైన, అనుకువైన ఆడపిల్ల పాత్రలనే ఎక్కువగా ఎంచుకున్న సౌందర్య, యూత్‌కి ఫెవరెట్ హీరోయిన్‌గా మారింది.
మహేష్ ‘యానిమల్’ కాదు, ఆయనకి చెప్పింది ‘డెవిల్’ : సందీప్ రెడ్డి వంగా
అప్పట్లో సౌందర్య హీరోయిన్‌గా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భావించాడట. అయితే మహేష్ తండ్రి కృష్ణ వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. 1994లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సౌందర్య. అప్పటికే ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెం.1’ వంటి మూడు సినిమాల్లో సౌందర్యను హీరోయిన్‌గా పెట్టి హ్యాట్రిక్ హిట్లు సాధించాడు ఎస్వీ కృష్ణారెడ్డి.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘నెం.1’ సూపర్ సక్సెస్ తర్వాత తల్లి సెంటిమెంట్‌తో ‘యమలీల’ సినిమా స్టోరీ రాసుకున్నాడు ఎస్వీ కృష్ణారెడ్డి. అప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన సౌందర్యనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. హీరోగా ఓ కుర్రాడు అయితే బాగుంటుందని, కృష్ణ కొడుకు మహేష్‌ని అనుకున్నాడట ఎస్వీ కృష్ణారెడ్డి.
అయితే అప్పటికి నాలుగేళ్ల క్రితమే మహేష్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి చదువుపై ఫోకస్ పెట్టాడు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రితో కలిసి ‘శంఖారావం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘గూఢాచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అన్న తమ్ముడు’ వంటి సినిమాలు చేసిన మహేష్, అన్న రమేశ్ బాబుతో కలిసి ‘బజార్ రౌడీ’ వంటి సినిమాలు చేశాడు.
‘మావాడు సినిమాలు చేయడం లేదు. విదేశాల్లో చదువుకుంటున్నాడు’ అని కృష్ణ చెప్పడంతో.. మహేష్ ప్లేస్‌లో కమెడియన్ ఆలీని హీరోగా ఎంచుకున్నాడు ఎస్వీ కృష్ణారెడ్డి. అప్పటికే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సౌందర్య, కమెడియన్ ఆలీ పక్కన హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించింది.
SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..
అయితే కమెడియన్ పక్కన హీరోయిన్‌గా చేస్తే, స్టార్ హీరోల ఛాన్సులు పోతాయని, క్రేజ్ తగ్గిపోతుందని ఆమె తల్లి, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాని క్యాన్సిల్ చేయించింది. దీంతో సౌందర్య, ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’ సినిమాలో ఆలీతో కలిసి ‘చినుకు చినుకు అందెలతో’ ఐటెం సాంగ్‌లో నటించింది.
1990లో వచ్చిన ‘బాలచంద్రుడు’ తర్వాత 9 ఏళ్ల పాటు బ్రేక్ తీసుకుని, విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చాడు మహేష్ బాబు. 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ‘ఒక్కడు’ సినిమాతో స్టార్‌డమ్ అందుకుని, ‘పోకిరి’ సినిమాతో ‘సూపర్ స్టార్’ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..
అలా ఆలీ హీరోగా, ఇంద్రజ హీరోయిన్‌గా రూపొందిన ‘యమలీల’ 1994లో బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. తెలుగులో 12 ఏళ్లలో 100కి పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసిన సౌందర్య, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, 2004లో విమాన ప్రమాదంలో మరణించింది.