Mahesh Babu : 15 ఏళ్ల కిందట ఓ సినిమా, ఎన్ని కోట్లు వసూలు చేసినా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 100 రోజులు ఆడకపోతే, అది ఫ్లాప్ కిందే లెక్క. సినిమాల రిజల్ట్‌ని డిసైడ్ చేసే మెయిన్ థియేటర్లన్నీ ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లోనే ఉండేది. ఇప్పుడు కథ మారింది. సినిమా 100 రోజులు కాదు, 5 రోజులు ఆడకపోయినా పెట్టిన బడ్జెట్‌కి ఒక్క రూపాయి ఎక్కువ తెచ్చిందంటే అది హిట్టు కిందే లెక్క.
Sai Dharam Tej : బడ్జెట్ పెరిగి ఆగిన సాయిధరమ్ తేజ్ సినిమా! ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్..
మల్టీప్లెక్సులు పెరిగిన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకు బ్యాడ్ టైమ్ మొదలైంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో థియేటర్లు, ప్రేక్షకులతో కళకళలాడే ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇప్పుడు సగానికి పైగా థియేటర్లు మాయమయ్యాయి. సుదర్శన్ 70MM థియేటర్‌తో పాటు ఓడియన్, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్, శ్రీమయూరి వంటి థియేటర్లు మాయమై, ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి.
సుదర్శన్ 35MM, దేవీ, సంధ్య 70MM, సంధ్య 35MM, సప్తగిరి వంటి కొన్ని థియేటర్లు మాత్రమే మిగిలాయి. దేవీ థియేటర్, నాగార్జునకి చాలా స్పెషల్ అయితే, సుదర్శన్ 35MM థియేటర్ మహేష్‌కి ఫెవరెట్. ఒక్కడు, మురారీ, అతడు.. ఇలా మహేష్ సినిమాలన్నీ ఇక్కడే విడుదలై, 200 రోజులు ఆడాయి.. గచ్చిబౌలిలోని తన మల్టీప్లెక్స్ కంటే ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లని సుదర్శన్ అంటేనే తనకి ఎంతో ఇష్టమని మహేష్ చాలాసార్లు చెప్పాడు మహేష్.
Mahesh Babu : శ్రీమంతుడే కాదు.. మహర్షి కూడా నాదే..
తాజాగా ఈ థియేటర్ స్థానంలో 7 స్క్రీన్లతో AMB మల్టీప్లెక్స్ తీసుకురాబోతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. నగరంలో సినిమాలన్నీ అడ్డా అయినా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇప్పటిదాకా మల్టీప్లెక్స్ రాలేదు. మహేష్ మల్టీప్లెక్స్ ఎంట్రీ, పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న సంధ్య వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా త్వరలోనే మాయం కావచ్చు.