Mahesh Babu : హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు స్టైల్‌గా స్మోకింగ్ చేస్తున్నట్టు చూపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. అప్పుడెప్పుడో వచ్చిన ‘ముఠా మేస్త్రీ’ దగ్గర్నుంచి, లేటెస్ట్ ‘గుంటూరు కారం’ వరకూ ఇదే ఫార్ములాని వాడుతున్నారు దర్శకులు. ‘గుంటూరు కారం’ నుంచి ఇప్పటిదాకా అరడజనుకి పైగా స్టిల్స్, ఓ టీజర్ రిలీజ్ అయ్యాయి. అన్నింట్లోనూ బాబు గారి నోట్లో బీడి మాత్రం కామన్..
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..
‘యువరాజు’, ‘వంశీ’ సినిమాల్లో స్మోకింగ్ సీన్స్ చేసిన మహేష్ బాబు, ‘ఒక్కడు’ మూవీతో మాస్ హీరోగా మారాడు. ‘పోకిరి’, ‘సైనికుడు’, ‘అతిథి’ సినిమాల్లోనూ స్మోకింగ్ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేయడం కోసం స్మోకింగ్ అలవాటు చేసుకున్న మహేష్, ఆ తర్వాత దానికి తీవ్రంగా అలవాటు పడిపోయాడట. ఒకానొక సమయంలో రోజుకి ఐదు ప్యాకెట్లు అవలీలగా అయిపోగొట్టేవాడట.
స్క్రీన్ మీద మహేష్ స్టైల్‌గా సిగరెట్ తాగడం చూసి ఆయన ఫ్యాన్స్ కూడా ఈ అలవాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మహేష్, తన ఛైయిన్ స్మోకింగ్ హ్యాబిట్ వదిలించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించాడు. అయితే అన్నీ బెడిసి కొట్టేశాయి..
మహేష్ ఛైయిన్ స్మోకింగ్ విషయం తెలుసుకున్న ఓ స్నేహితుడు, ‘ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ అనే పుస్తకాన్ని ఇచ్చాడు. దీన్ని చదివిన మహేష్, మెల్లిమెల్లిగా స్మోకింగ్ వదిలేశాడు. ఆయన కూతురు సితార కూడా మహేష్ స్మోకింగ్ మానేయడానికి ఓ కారణం.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
అలాంటి మహేష్, ‘గుంటూరు కారం’ కోసం మళ్లీ బిడీ నోట్లో పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ కోసం ఓ మాస్ మూవీ చేయాలని అనుకున్న మహేష్, త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ సీన్స్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే మళ్లీ అలవాటు పడకుండా ఉండేందుకు మహేష్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఆన్ స్క్రీన్ కోసం స్మోకింగ్ చేసినా, ఆఫ్ స్క్రీన్ దాని జోలికి వెళ్లడం లేదు మహేష్.