Maharshi Valmiki : బోయవాడైన వాల్మీకి, వేటాడుతూ ఓ పక్షిని కొట్టాడు. ఆ పక్షి మరణం చూసి దాని జంట పక్షి శోకించింది. ఆ బాధకరమైన దృశ్యాన్ని చూసి బోయవాడైన వాల్మీకి, మహర్షిగా మారాడని ఓ కథ ప్రచారంలో ఉంది. కొన్ని సినిమాల్లో కూడా వాల్మీకి కథను ఇలాగే చెప్పారు. మరికొన్ని కథల్లో అయితే వాల్మీకి ఓ దారి దోపిడీ దొంగ అని కూడా రాశారు.
కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఎందుకు ఎక్కువగా చేస్తారో తెలుసా..!?
‘గద్దలకొండ గణేశ్’ సినిమాకి ముందు అనుకున్న పేరు ‘వాల్మీకి’యే. దొంగ, క్రూరుడు అయిన వ్యక్తి, మంచి మనిషిగా ఎలా మారాడనే కాన్సెప్ట్ కావడంతో ‘వాల్మికి’ పేరు అనుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. అయితే రిలీజ్‌కి ముందు ఓ వర్గం అభ్యంతరం చెప్పడంతో ‘వాల్మికి’ పేరుకి బదులు ‘గద్దలకొండ గణేశ్’ పేరుతో సినిమా రిలీజ్ అయ్యింది.
అసలు వాల్మీకి కథ ఏంటి..?
చాలామంది అనుకుంటున్నట్టుగా వాల్మీకి మహర్షి బోయవాడు కాదు, దారి దోపిడి దొంగ కూడా కాదు. ఆయన ప్రచేతస అనే మహర్షి కుమారుడు. అందుకే వాల్మీకికి ప్రాచేతసులు అనే పేరు కూడా ఉంది..
వాల్మీకి, తన శిష్యులతో కలిసి ఓ సారి నదీతీరానికి వెళ్తాడు. ఆ సమయంలో ఓ బోయవాడు, ఓ కొంగను కొడతారు. బాణం తగిలి కిందపడిన కొంగ దగ్గర దాని జంట కొంగ వచ్చి శోకిస్తూ ఉంటుంది. ఈ సంఘటనను వాల్మీకి చూస్తాడు. అప్పుడు రామయణ శ్లోకం పుట్టిందని ఇతిహాసాలు చెబుతున్నాయి.
అయితే రామాయణం కథను ఎవరికి నచ్చినట్టు వాళ్లు మార్చుకుంటూ రావడంతో వాల్మీకి పుట్టుక గురించి కూడా రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. రామాయణం నిజమా కాదా? అనేది పక్కగా ఎలాగైతే చెప్పలేమో, వాల్మీకి పుట్టుక రహస్యం కూడా ఇది అని నూటికి నూరు శాతం చెప్పలేము.
అద్భుతాలకు ఆనవాళ్లు ఈ కేదారేశ్వర ఆలయం..