Love Mouli Movie Review : తేజ దర్శకత్వంలో ‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవ్‌దీప్, ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేశాడు. ‘ఆర్య 2’ మూవీలో అజయ్ పాత్రలో సైడ్ క్యారెక్టర్ చేసిన నవ్‌దీప్, ఆ తర్వాత వరుసగా సైడ్ క్యారెక్టర్లతోనే బిజీ అయ్యాడు. దాదాపు దశాబ్దం తర్వాత నవ్‌దీప్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’. రాజమౌళి దగ్గర పని చేసిన అవనీంద్ర, ఈ సినిమాకి డైరెక్టర్… జూన్ 7న విడుదలైన ‘లవ్ మౌళి’ సినిమాలో పంకూరి గిద్వానీ హీరోయిన్‌గా నటించింది..
Manamey Movie Review : శర్వానంద్ మరో ఫీల్ గుడ్ మూవీ..
టీజర్, ట్రైలర్‌తోనే తానేం చూపించాలనుకుంటున్నాడో చెప్పేశాడు డైరెక్టర్. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులకు దూరమైన మౌళి, తాత దగ్గరగా పెరుగుతున్నాడు. నచ్చిన పని చేసుకుంటూ, సమాజాన్ని పట్టించుకోకుండా బతికేస్తూ ఉంటాడు. అలాంటి మౌళి జీవితంలో ఓ అమ్మాయి వస్తుంది? ఆమెతో అతని ప్రేమ ఎలా సాగింది. ఆమె ప్రేమ వల్ల అతను ఎలా మారాడు? ఇదే ‘లవ్ మౌళి’ సినిమా కథ..
ఇందులో యూత్‌కి కావాల్సిన లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ పుష్కలం. లవ్ మౌళి అనే కేర్‌లెస్ కుర్రాడి పాత్రలో నవ్‌దీప్ ఒదిగిపోయాడు. హీరోయిన్ పంకూరి గిద్వానీ ఎక్కడా మొహమాట పడకుండా అందాలు చూపించింది. యాక్టింగ్‌లోనూ మెప్పించింది. ఈ ఇద్దరూ కాకుండా మిగిలిన పాత్రలు చాలా తక్కువగా కనిపిస్తాయి. స్పెషల్ గెస్ట్ రోల్‌లో రానా కనిపిస్తాడు.
Why Do Movies Release On Fridays : శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..!?
డైరెక్టర్ అవనీంద్ర టేకింగ్, డైరెక్షన్, రైటింగ్ అన్నీ ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ అయ్యాయి. గోవింద్ వసంత సంగీతం, క్రిష్ణ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ప్రకృతికి దగ్గర ఉండే యువకుడి కథ కావడంతో షూటింగ్ అంతా ఎక్కువగా మేఘాలయలో జరిగింది. అక్కడ అందాలను చక్కగా చూపించడంతో కెమెరామెన్ పనితనం కనిపించింది.
చెప్పిన పాయింట్ బాగున్నా, ముద్దులు, శృంగారం కాస్త ఎక్కువ కావడంతో మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ టైపులో యూత్‌ఫుత్ ఎంటర్‌టైనర్ ఇష్టపడేవాళ్లకు ‘లవ్ మౌళి’ నచ్చుతుంది.