Love Me If You Dare Movie Review : ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ రెండో సినిమా ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’. ‘బేబీ’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో కాస్త హైప్ కూడా వచ్చింది. మే 25న ‘Love me if you dare’ మూవీ, ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. మరి ఆశీష్‌కి ఈ ‘లవ్ మీ’ మూవీ సక్సెస్ ఇచ్చినట్టేనా…
హీరో అర్జున్‌కి మిస్టరీలను ఛేదించడం అంటే భలే ఇష్టం. ఎదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు, దాని రహస్యం కనుక్కునేదాకా దాన్ని వదిలిపెట్టడు. అలాంటి హీరో అనుకోకుండా ఓ దెయ్యంతో ప్రేమలో పడతాడు. ఆ దెయ్యం ప్రేమను పొందడానికి అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు ఆడవాళ్ల గురించి తెలుస్తుంది. ఆ చావులకు, హీరో ప్రేమకథకు సంబంధం ఏంటి? హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఏంటి? చివరికి దెయ్యం ప్రేమను హీరో సాధించగలిగాడా? వారి ప్రేమకి క్లైమాక్స్ ఏంటి? ఇదే ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ మూవీ కథ..
యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..
దెయ్యంతో ప్రేమ అనే కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. అయితే కథలో కానీ, కథనంలో కానీ ఎక్కడా క్లారిటీ కనిపించదు. హార్రర్ ప్లస్ లవ్ స్టోరీ కలిపి తీయాలనే ప్రయత్నంలో అటు కాక, ఇటు కాకుండా చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సా…గుతుంది ‘లవ్ మీ’ మూవీ.. ఆశీష్ యాక్టింగ్‌లో కొత్తదనం ఏమీ కనిపించదు. ఆశీష్ హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు ఫ్యామిలీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదు. కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకునే విధానంలో కూడా కాస్త వైవిధ్యం చూపించాలి..
‘బేబీ’మూవీ తర్వాత వైష్ణవి చైతన్య చేసిన సినిమా ఇది. అయితే ఇందులో వైష్ణవికి మంచి పాత్రే దక్కినా, పెద్దగా నటించడానికి స్కోప్ అయితే దక్కలేదు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ డైరెక్షనే. కొన్ని ట్విస్టులతో సినిమా చూసే ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాలని అనుకున్నాడు అరుణ్. అయితే అతని అనుభవలేమి, సినిమా మొదలైన పావుగంటకే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. రవి కృష్ణ, రాజీవ్ కనకాల, సిమ్రాన్ చౌదరి వంటి నటీనటుల బాగా నటించారు..
కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు అక్కడక్కడా మెప్పిస్తుంది. పాటలు పెద్దగా ఎక్కవు. పీసీ శ్రీరామ్ వంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేశాడు. ఆయన కెమెరా వర్క్ బాగున్నా, సినిమాని అదొక్కటే కాపాడలేదు. ఎడిటింగ్‌కి సరిగ్గా పని చెప్పలేదు. సొంత ప్రొడక్షన్ బ్యానర్ కావడంతో బాగానే ఖర్చు చేశారు. అయితే ఖర్చు మీద పెట్టిన శ్రద్ధ, కథ మీద, అవుట్‌ఫుట్ మీద పెట్టి ఉంటే ఓ మంచి సినిమా తయారయ్యేది. ఓవరాల్‌గా ఇది ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కాదు, ‘వాచ్ మీ ఇఫ్ యూ డేర్’గా మారింది..