Love Guru : ప్రేమ (Love).. ఈ మాట పలికెప్పుడు తీయగా.. అనుభవించేప్పుడు అద్భుతంగా ఉంటుంది. ప్రేమంటే ఏంటో చెప్పడం కష్టం కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో దీన్ని అనుభవించే ఉంటారు. కొంతమందికి అది ‘ప్రేమ’ అని తెలియకపోవచ్చు. ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావం.. దాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా Express చేస్తారు. కొన్నిసార్లు మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారన్న విషయం, మనకీ ఎప్పటికీ అర్థం కూడా కాదు. చెప్పకపోవడం వాళ్ళ తప్పా.. అర్థం చేసుకోకపోవడం వీళ్ళ తప్పా అంటే.. చెప్పడం కష్టం.
అంతా బానే ఉన్నా ఎంతటి ప్రేమకైనా బ్రేకప్ అని (Breakup) చెప్పుకునే, అరుచునే సందర్భాలు వస్తాయి. వాటిని ఎలా ఓవర్ కం (Overcome) చేసుకొని నిలబడ్డారు అనే దానిపైనే వాళ్ళ ప్రేమ ఆధారపడి ఉంటుంది. అన్నీ బ్రేకప్ లు తిరిగి మళ్లీ కలిసినప్పుడు ‘మాయని మచ్చగానే’ ఉండిపోవు. ఒక్కోసారి అంతకంటే అద్భుతంగా ప్రేమించే, అర్థం చేసుకునే అవకాశం రావొచ్చు. ఎప్పుడూ పక్కనే ఉండే వ్యక్తి ఒక్కసారిగా కనిపించపోతే వాళ్ళు మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం అవుతుంది.
జంటగా తిరిగిన శబ్ద క్షణాల కన్నా
విడిపోతున్నప్పుడు గుండె పలికే నిశ్శబ్దరాగం
బాధల కొలిమే. అందుకే మనుషుల్ని జ్ఞాపకాలు చంపినంత ఘోరంగా ఎవరు చంపలేరు. ప్రేమలో ఎవరు ఇష్టపడి విడిపోరు.. చిన్నవో, పెద్దవో Adjustments కష్టమై తప్పనిసరి పరిస్థితిలో విడిపోవాల్సి వస్తుంది. అందుకే విడిపోయాక కూడా ఒక హృదయం కోసం.. ఇంకో హృదయం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక చిన్న స్పర్శ, వీలైతే టైట్ హగ్ (Tight Hug) అంతే.. ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. శిశిరం ఎరుగని వసంత కాలంలా . .
Note : ప్రేమ పేరుతో జరిగే Business లకు దీనికి సంబంధం లేదు.