Love Guru : ప్రేమ.. టీనేజర్స్ నుంచి పండు ముసలి వరకు ప్రేమను ప్రేమించని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ నిజంగా ప్రేమ ‘ప్రేమ’నే ఇస్తుందా అంటే.. మాత్రం ఆలోచించాల్సిందే..!
పరిచయం స్నేహంగా, స్నేహం ఇష్టంగా, ఇష్టం ప్రేమగా మారే జర్నీ లో ‘డెస్టినీ’ మాత్రం అలకలు, అధికారాలు, సంజాయిషీలతో తీయనైన ప్రేమ బాగుంటుంది కానీ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా మనకి బాగున్నంత వరకు, లేదా ఎదుటివాళ్లలో మన ఆలోచన, మనకు మన ఇష్టమైన విషయాలు దూరం కానంత వరకు.. ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రేమ ఉంటే చావు వరకు ప్రేమగా తీసుకుని వెళ్లే వరకూ మారకుండా ఉండే ప్రేమ చాలా అంటే చాలా అరుదు.
తక్కిన ప్రేమలు ఇవన్నీ దాట్టుకుని ముందుకు వెళ్లలేక నాలుక మీద వేపాకు ఉన్నట్టు చేదెక్కుతుంది. ప్రేమకు సమాధానం సరిపోదు, సంజాయిషీ కావాలి, ప్రతి క్షణం నువ్వు పలానా పలానా అని చెప్పుకుని తిరిగే వరకు. కొన్నిసార్లు అయితే మాటలు సరిపోవు ప్రేమలో ఉన్న నీతో అని చెప్పడానికి ప్రూఫ్ లు కావాలి.
కాల్ లిస్ట్, కాల్ హిస్టరీ, చాట్ ఇలా ప్రతీది కనిపించాలి. చెప్పేది చెప్పకూడనిది ఉన్న లేకున్నా.. ప్రతీది తెలియాలి అలా తెలిసేలా చేస్తేనే ప్రేమ.
పెదాలు పలికే మాటలు, ఒంటి మీద వేసుకునే బట్టలు అన్నీ ఒకరి ఇష్టాలు.. ఇంకొరి ఇష్టాలుగా రుద్దబడతాయి. ముందు అవన్నీ మనపై ప్రేమలా కనిపిస్తున్నా రాను రాను చివరకు అవన్నీ నిన్ను నీ నుంచి దూరం చేస్తాయి. కారణం ఏమైనా “ప్రేమ” పంజరంలో చిక్కుకున్న చిలకలా విలవిల్లాడడం తప్ప ఇంకోమార్గం ఉండదు.
అందుకే ప్రేమ.. ప్రేమనే ఇస్తుందా అంటే.. సమాధానం అంత సులభం కాదు . .
కానీ
మన ప్రేమని ప్రేమగా చూసుకునే ప్రేమ ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకోడానికి..