Love Guru Review : ‘బిచ్చగాడు’, ‘డాక్టర్ సలీం’ వంటి తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు 2’ సినిమాకి తమిళ్‌లో కంటే తెలుగులో మంచి కలెక్షన్లు వచ్చాయి. విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘లవ్ గురు’. మృణాళిని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 11న విడుదలైంది.
మలేషియాలో ఓ కేఫ్ నడిపించే హీరో, స్వదేశానికి తిరిగి వచ్చి హీరోయిన్‌ని చూసి ప్రేమిస్తాడు. ఆమెతోనే అతనికి పెళ్లి అవుతుంది. అయితే హీరోయిన్‌కి హీరో అంటే ఇష్టం ఉండదు. ఆమె హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉంటుంది. మరి వారి సంసార జీవితం ఎలా సాగింది? ఇదే ‘లవ్ గురు’ మూవీ కథ.
Geethanjali Malli Vachhindhi Review : నో కామెడీ, నో హార్రర్..
కథ పరంగా చూస్తే ఇది షారుక్ హీరోగా వచ్చిన ‘రబ్ దే బనాదే జోడీ’ మూవీకి దగ్గరగా ఉంటుంది. అయితే ఇందులో చెల్లెలి సెంటిమెంట్ ఒకటి ఎక్స్‌ట్రా.. కథ పాతదే అయినా తాను అనుకున్న కథనంతో కాస్త ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించడంతో దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ సక్సెస్ అయ్యాడు.
ఇప్పటిదాకా ప్రతీ సినిమాకి ఓ ప్రయోగాత్మక కథను ఎంచుకుంటూ వచ్చిన విజయ్ ఆంటోనీ, ఈసారి సింపుల్ మూవీతో వచ్చాడు. విజయ్ ఆంటోనీ సినిమాల్లో ఊహించే ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇందులో ఉండవు. నటుడిగా విజయ్ ఆంటోనీ, మృణాళిని అదరగొట్టారు. భరత్ ధన శేఖర్ మ్యూజిక్, తెలుగువాళ్లకు అరవ ఫీలింగ్ ఇస్తుంది. మొత్తంగా టైమ్ పాస్‌కి మూవీ చూడాలనుకునేవారికి ‘లవ్ గురు’ నచ్చుతుంది..