Laapataa Ladies : ‘యానిమల్’ని బీట్ చేసిన ‘లాపటా లేడీస్’.. అంతలా ఏముంది ఈ మూవీలో..

Laapataa Ladies :  నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ‘ యానిమల్’ మూవీ రికార్డును, ఓ చిన్న సినిమా బ్రేక్ చేసింది. పెద్దగా పరిచయం లేని నటీనటులతో వచ్చిన ‘లాపటా లేడీస్’ మూవీ, ప్రస్తుతం నెట్‌ఫ్లెక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇప్పటికే 14 మిలియన్లకు పైగా మంది ఈ మూవీని ఓటీటీలో వీక్షించారు. మార్చి 1న థియేటర్లలో విడుదలైన ‘లాపటా లేడీస్’, థియేటర్లలో రూ.25 కోట్లకు పైగా రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది..

Rana Daggubati : యానిమల్ మూవీపై షాకింగ్ కామెంట్స్..

దీపక్ కుమార్, పెళ్లి చేసుకుని అత్తారింటి నుంచి పెళ్లికూతురిని తీసుకుని, ఇంటికి బయలుదేరతాడు. సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురికి ఎర్రటి వస్త్రం కప్పి పంపిస్తారు. రైలులో ఒకే బోగీలో ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఒకే రకమైన పెళ్లిచీరలతో ఉండడంతో కంఫ్యూజన్‌లో పెళ్లికూతురు మారిపోతుంది. హీరో పెళ్లాడిన పూల్ కుమారికి బదులుగా జయ అనే మరో యువతికి, హీరో ఇంటికి వస్తుంది.. పూల్ కుమారి, జయ వెళ్లాల్సిన విలేజీకి వెళ్తుంది. తన ఊరు పేరు తప్ప ఇంకేమీ తెలియని పూల్ కుమారి, తన భర్త దీపక్ దగ్గరికి ఎలా చేరింది. దీపక్ ఇంటికి వెళ్లిన జయ ఏం చేసింది? ఇదే ‘లాపటా లేడీస్’ మూవీ కథ..

సింపుల్ కథను అంతే సింపుల్‌గా, ఎమోషనల్ సీన్లతో తెరకెక్కించింది దర్శకురాలు కిరణ్ రావు (ఆమీర్ ఖాన్ భార్య). బిప్లస్ గోస్వామి రాసిన కథను తెరకెక్కించడంలో డైరెక్టర్ ప్రతిభ బయటపడింది. పూల్ కుమారిగా నితాన్షి గోయెల్ అందం, అమాయకత్వం కలగలిపి చక్కగా నటించింది. ఈ సినిమా స్పెషల్ అట్రాక్షనే నితాన్షి గోయెలే అని చెప్పొచ్చు. అలాగే జయ సింగ్‌గా ప్రతిభా రంతా, దీపక్ కుమార్‌గా స్పర్శ్ శ్రీవాస్తవ్ తమ పాత్రల్లో జీవించేశారు. పూల్ కుమారికి ఆశ్రయం ఇచ్చే కొట్టు యజమానిగా ఛాయా కదమ్, సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో రవి కిషన్ అద్భుతంగా నటించారు. భారతీయ దాంపత్య బంధాలను సుతిమెత్తిగా స్పర్శిస్తూ సాగిన ‘లాపటా లేడీస్’, అటు బాలీవుడ్‌ తో పాటు ఇటు సౌత్ ఆడియెన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post