Kuwait Fire Incident : బుధవారం తెల్లవారుజామున కువైట్‌లోని నివాస భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. మరణించిన వారిలో కేరళకు చెందిన వారు 11 మంది అన్నట్టు సమాచారం. కువైట్‌లోని దక్షిణ అహ్మదీ గవర్నట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని దిగువ అంతస్తులో మంటలు చెలరేగి, భవనంలో వేగంగా వ్యాపించడంతో మంటలు చెలరేగడంతో దాదాపు 50 మంది వరకు మృతి చెందారం
35 మందిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. కనీసం ఐదుగురు వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉండగా ఏడుగురి పరిస్థితి క్లిష్టంగా అన్నట్టు తెలుస్తుంది. మరణించిన 11 మంది మలయాళీలు కాకుండా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు.
Joe Biden : కొత్త సమస్యను ఎదుర్కొంటున్న అమెరికా ప్రెసిడెంట్..
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, బాధితులను ఆదుకునేందుకు అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తోందని, ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ప్రమాదంలో పలువురు భారతీయులు మరణించారనే వార్తతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, రాయబారి శిబిరానికి వెళ్లారని చెప్పారు. “విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా రాయబార కార్యాలయం పూర్తి సహాయాన్ని అందజేస్తుంది…” అని ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.