Kushitha Kallapu – Guntur Kaaram : సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీ ఖుషిత కల్లాపు. ఆ మధ్య పబ్‌లో బజ్జీలు తినడానికి వెళ్లానని చెప్పి, ‘బజ్జీల పాప’గా ఫేమస్ అయిన ఖుషిత, ‘గుంటూర్ కారం’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ‘గుంటూర్ కారం’ మూవీ చూసినవాళ్లు, ఎక్కడా ఖుషిత పాప లేకపోవడంతో షాక్ అయ్యారు.
గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..
ఖుషిత సీన్స్‌ని ఎడిటింగ్‌లో లేపేసి ఉంటారని టాక్. అలాగే ఈ మూవీలో ముందుగా పూజా హెగ్దేని హీరోయిన్గా అనుకున్నారు. అయితే షూటింగ్ మొదలై, మూడు నెలల తర్వాత క్రియేటివ్ డిఫరెన్సులతో పూజా హెగ్దే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.. పూజా హెగ్దే ఉండి ఉంటే, ‘గుంటూర్ కారం’ ఫ్లాప్‌కి ఆమెనే కారణమని తీవ్రమైన ట్రోల్స్ వచ్చేవి..
‘గుంటూర్ కారం’ మూవీకి ముందుగా పీ.ఎస్. వినోద్‌ని సినిమాటోగ్రాఫర్‌గా అనుకున్నారు. అయితే మధ్యలో వినోద్ తప్పుకోవడంతో అతని ప్లేస్‌లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వచ్చాడు. మనోజ్ సినిమాటోగ్రాఫీపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే ఫైట్ మాస్టర్లు కూడా మధ్యలో మారిపోయారు.. ఎన్ని మార్పులు చేసి, ‘గుంటూర్ కారం’ రిజల్ట్ మాత్రం మారలేదు.