KTR Harish Rao : తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. నవంబర్ 30న ఎన్నికలు జరగబోతుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈసారి కూడా తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే రాబోతుందని అంచనా వేశాయి.
అయితే తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీశ్ రావు చేసిన కామెంట్లు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘నేను పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. ఒకవేళ కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేస్తే, కచ్ఛితంగా అతనికి సపోర్ట్ చేస్తా..’ అంటూ వ్యాఖ్యానించాడు హరీశ్ రావు..
క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తిగా కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టి, రాష్ట్ర పాలనను వారసులకు అందించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అదీకాకుండా కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఆ ప్లేస్ కోసం ముందు వరుసలో ఉండేది ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు. ఒకరు క్లాస్ లీడర్, అయితే మరొకరు మాస్ లీడర్.
కేటీఆర్‌కి హైదరాబాద్ వంటి నగరాల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఐటీ రంగంపై మంచి అవగాహన ఉంది. కేసీఆర్‌కి సరైన వారసుడిగా పార్టీలో గుర్తింపు కూడా ఏర్పడింది..
గ్లాసు గుర్తు లేకుండానే జనసేన పోటీ చేస్తోందా? ఈ వార్తల్లో నిజమెంత?
కేటీఆర్‌కి సరైన పోటీ హరీశ్ రావు. గ్రామీణ ప్రాంతాల్లో హరీశ్ రావుకి వీరాభిమానులు ఉన్నారు. కార్యకర్తల సపోర్ట్‌తో పాటు నాయకులను ఎలా నియంత్రించాలో హరీశ్ రావుకి బాగా తెలుసు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో కేటీఆర్, హరీశ్ రావులను పరీక్షించారు కేసీఆర్..
ఈ పరీక్షల్లో కేటీఆర్ అర్బన్‌లో, హరీశ్ రావు రూరల్‌లో ఇద్దరూ మంచి మార్కులు సాధించారు. దీంతో ఒకవేళ బీఆర్‌ఎస్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టి, కేసీఆర్ ముఖ్యమంత్రి పొజిషన్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే.. ఆ పొజిషన్ ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.