Krish Jagarlamudi : కృష్ణవంశీ తర్వాత సామాజిక అంశాలపై సినిమాలు తీస్తూ, క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. ‘గమ్యం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన క్రిష్, అల్లు అర్జున్, మంచు మనోజ్‌లతో ‘వేదం’ తీసి క్రిటిక్స్‌ని మెప్పించాడు. ఆ తర్వాత ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలు తీశాడు.. అయితే ఈ మధ్య క్రిష్ పరిస్థితి అసలేం బాగోలేదు. ఎవరో మొదలెట్టిన సినిమాని పూర్తి చేస్తున్న క్రిష్, తన సొంత సినిమాలను పూర్తి చేయలేకపోతున్నాడు..
2019లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ సినిమా మొదలెట్టాడు క్రిష్. అయితే సినిమా పూర్తి అయ్యాక కంగనాతో క్రియేటివ్ డిఫెరెన్సులు రావడంతో ఈ ప్రాజెక్ట్ ఫినిషింగ్ టచ్‌లను ఆమెకే వదిలేశాడు. దీంతో ఈ మూవీ క్రెడిట్ మొత్తం తన ఖాతాలోనే వేసుకుంది కంగనా..
IPL Effect : టీవీల్లో సలార్ అట్టర్ ఫ్లాప్..
‘మణికర్ణిక’ నుంచి ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ బయోపిక్ మూవీకి వచ్చాడు క్రిష్. నిజానికి ఇది డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మొదలైన సినిమా. ముహుర్తం షాట్ తర్వాత బాలకృష్ణ, ఈ సినిమాలో 12 పాటలు పెట్టాలని అనుకున్నాడు. దానికి తేజ ఒప్పుకోకపోవడంతో సినిమా నుంచి తేజ తప్పుకున్నాడు. అంతకుముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు బాలయ్య. అయితే ఆర్జీవీ, ఎన్టీఆర్ మరణం దాకా అన్ని విషయాలు చెబుతానని చెప్పడంతో సీన్లోకి తేజ వచ్చాడు..
అలా తేజ స్టార్ట్ చేసిన సినిమాని పూర్తి చేసిన క్రిష్‌కి సంతోషం మిగల్లేదు. ఎందుకంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు పార్టులు కూడా ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. మధ్యలో ‘కొండపొలం’ తీసినా ఉపయోగపడలేదు. రీమేక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ సినిమాకి ఒప్పించి, ‘హరిహరవీరమల్లు ’ చేశాడు. అయితే ఇక్కడా హీరోతో క్రియేటివ్ డిఫరెన్సులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నాడు.. ఇక్కడ కూడా డైరెక్టర్ క్రిష్ 90 శాతానికి పైగా సినిమా పూర్తి చేసినా, ఆ క్రెడిట్ ‘రూల్స్ రంజన్’ ఫేమ్ జ్యోతికృష్ణకే వెళ్లనుంది పాపం..