Kerala Governor’s Big Claim Against Kerala CM After Convoy Attacked
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వాహనంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. సోమవారం సాయంత్రం తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో, ఎస్ఎఫ్ఐకి చెందిన నల్లజెండాలు చూపుతున్న నిరసనకారులను ఎదుర్కొనేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కారు దిగారు.
“వారు నా కారును ఢీకొట్టారు. ఇది ప్రజాస్వామ్య నిరసన మార్గమా? సీఎం వాహనం దగ్గరకు ఎవరైనా వెళ్లేందుకు అనుమతిస్తారా’’ అని గవర్నర్ ప్రశ్నించారు. ‘‘నన్ను భౌతికంగా దెబ్బతీసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ ఈ కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను కన్నూర్‌లో కూడా అలా చేసాడు”, అతను నిరసనకారులను “బ్లడీ నేరస్థులు” అని పదేపదే ఆరోపించారు.
ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్..
చాలాకాలంగా గవర్నర్, సీఎంల మధ్య వివాదం కొనసాగుతోంది. “తిరువనంతపురం వీధులను గూండాలు పరిపాలించనివ్వను” అని ఆయన చెప్పడం వినిపించింది. పోలీసులు ఆందోళనకారులను తీసుకెళ్లిన తర్వాత గవర్నర్ కారు ఎక్కి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ ఘటనపై నగర పోలీసు కమిషనర్ సీహెచ్ నాగరాజు విచారణకు ఆదేశించారు.
మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత..
గవర్నర్ వాహనంపై దాడి చేసినందుకు ఏడుగురు సహా 19 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా గవర్నర్ ఆరిఫ్ తన విధులను సరిగా నిర్వర్తించడం లేదని సీఎం విజయన్ ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.