Kattappa Sanjay Dutt!: ఆ ఒక్క కారణంగానే సత్యరాజ్‌ని తీసుకున్నారా…

Film News :కట్టప్పగా సంజయ్ దత్! ఆ ఒక్క కారణంగానే సత్యరాజ్‌ని తీసుకున్నారా…

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ కట్టప్ప. మాహిష్మతి రాజ్యానికి కట్టుబానిసగా, రాజుకి నమ్మినబంటుగా ఉండే కట్టప్ప పాత్రలో తమిళ నటుడు సత్యరాజ్ అద్భుతంగా నటించాడు… శ్రీహరి బతికి ఉండి ఉంటే, సత్యరాజ్‌కి ఈ పాత్ర వెళ్లి ఉండేది కాదని చాలా మంది అభిప్రాయం..

అయితే కట్టప్ప పాత్రను రాస్తున్నప్పుడు శ్రీహరి కాకుండా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ని ఆ పాత్రలో ఊహించుకున్నాడట రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ‘బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్ర చాలా కీలకం. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఆ పాత్రే ఎక్కువ సేపు తెర మీద కనిపిస్తుంది. కథను మలుపు తిప్పేది కూడా ఈ పాత్రే.. అందుకే ఈ పాత్ర కోసం సంజయ్ దత్‌ని అనుకున్నాం..

Prabhas Salaar : ‘బాహుబలి’ మూవీని దాటేసిన ‘సలార్’.. మిగిలింది ఆ రెండే..

అయితే అప్పటికి సంజయ్ దత్ ఇంకా జైలులోనే ఉన్నాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా మళ్లీ లోపలికి వెళ్లొచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కోసం ఇలాంటి రిస్క్ చేయలేం కదా, అందుకే సత్యరాజ్‌ని తీసుకోవాల్సి వచ్చింది…’ అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post