Kannappa Teaser : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్.. జెట్ స్పీడ్‌తో వదులుతున్నారే..

Kannappa Teaser : మంచు విష్ణు వర్థన్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘కన్నప్ప’. పాన్ ఇండియా ఫిల్మ్ అంటూ కాజల్‌తో కలిసి ‘మోసగాళ్లు’, సన్నీ లియోన్‌, పాయల్ రాజ్‌పుత్‌లతో కలిసి ‘జిన్నా’ మూవీస్ చేసిన మంచు విష్ణు, రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘కన్నప్ప’ మొదలెట్టాడు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోకి మొన్ననే ప్రభాస్ అడుగుపెట్టాడు. ఇంతలోనే టీజర్ రిలీజ్ అంటూ షాక్ ఇచ్చాడు మంచు విష్ణు..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 20న సాయంత్రం 6 గంటలకు ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కాబోతోంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ కేన్స్‌లో టీజర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన సినిమాకి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు మంచు విష్ణు. ప్రయత్నం మంచిదే కానీ టీజర్ రిలీజ్ పోస్టర్ చూస్తే కాస్త తేడా ఉంది. భక్త కన్నప్ప జీవితకథ ఆధారంగా ‘కన్నప్ప’ మూవీ తెరకెక్కుతోంది.

Kannappa Movie : కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదు! వేరే క్యారెక్టర్ నచ్చడంతో..

చారిత్రక ఆధారాల ప్రకారం తిన్నడు అనే బోయవాడు, పరమ శివుడికి తన రెండు కళ్లు ఇచ్చి ‘కన్నప్ప’గా మారాడు. బోయవాడు కావడంతో తిన్నడు, అడవిలో మృగాలను వేటాడి ఆ మాంసాన్ని తెచ్చి, పరమశివుడికి ప్రసాదంగా పెట్టేవాడు. అయితే కన్నప్ప పోస్టర్‌లో ఉన్న కత్తి, వెనకాల ఉన్న గుర్రాలు, సైనికులు చూస్తుంటే హీరోయిజం కోసం ‘కన్నప్ప’ కథలో మార్పులు, చేర్పులు చేసినట్టే ఉంది.

ఇంతకుముందు ఇలాగే డైరెక్టర్ ఓం రౌత్, రామాయణాన్ని మార్చి చెప్పాలని ప్రయత్నించి, ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ తీశాడు. ఈ మూవీ డిజాస్టర్ కావడమే కాకుండా ప్రభాస్, ఓం రౌత్‌ తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ముందే మంచు విష్ణు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఫేస్ చేశాడు. ఈ సారి ఎక్కడ తేడా కొట్టినా సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు మరి…

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post