Kannappa Movie : కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదు! వేరే క్యారెక్టర్ నచ్చడంతో..

Kannappa Movie : మంచు విష్ణు వర్థన్ బాబు హీరోగా అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, కన్నప్ప సెట్స్‌లో జాయిన్ అయినట్టుగా ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ లుక్‌ని రివీల్ చేయకుండా కాళ్లు మాత్రం కనిపించేలా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ‘కన్నప్ప’ చిత్ర టీమ్. ఈ పోస్టర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాట్లాడాడు మంచు విష్ణు..

‘కన్నప్ప మూవీలో అద్భుతమైన కథ ఉంది. అంతకంటే అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ క్యారెక్టర్లు గొప్ప నటులు చేస్తే బాగుంటుందని నేను అనుకుని, వాళ్లను అప్రోచ్ అవ్వడం జరిగింది. మొన్న నా మిత్రుడు ప్రభాస్, కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అవ్వడని చెప్పిన పోస్ట్, ఇండియాలో నెం.1గా ట్రెండ్ అయ్యింది.

Ram Pothineni : చైతూని ఫాలో అవుతున్న Rapo..

ప్రభాస్ దగ్గరికి వెళ్లి, నేను ఇలా కన్నప్ప అనే మూవీ చేస్తున్నాను, ఇందులో నువ్వు ఈ పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పాను. ప్రభాస్ కథ విని, క్యారెక్టర్లు తెలుసుకుని.. నేను చెప్పిన క్యారెక్టర్ కాకుండా వేరే పాత్రను ఎంచుకున్నాడు. నువ్వు చెప్పిన క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ చేస్తానని అన్నారు. ప్రభాస్ చేస్తానని చెప్పగానే ఆ పాత్రను చూసి డైహార్ట్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీలవుతారు. ప్రభాస్‌కి ఏది నచ్చిందో అదే చేస్తున్నారు… నేను, ఒక్కో క్యారెక్టర్‌ని మీకు రివీల్ చేస్తాను. అప్పటిదాకా ఏదేదో ఊహించుకోకండి. త్వరలో మీ ముందుకు ఓ అద్భుతమైన మూవీ తీసుకొస్తాం.. ’ అన్నాడు మంచు విష్ణు..

విష్ణు చెప్పడానికంటే ముందే ‘కన్నప్ప’ సినిమాలో అక్షయ్ కుమార్, పరమశివుడి పాత్రలో కనిపించబోతున్నాడని, నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ నటిస్తాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post