Kannappa Movie : 52 గంటల సీరియల్ తీసి, 3 గంటల సినిమాగా..

Kannappa Movie
Kannappa Movie

Kannappa Movie : మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ కొత్త కాదు. మంచు మోహన్ బాబు నుంచి ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణువర్థన్ బాబు, కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. మంచు విష్ణు, తన మార్కెట్‌కి మంచి ఖర్చు చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు. మంచు విష్ణు నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు కలిపినా రూ.100 కోట్లు కావు.. అలాంటిది ఈ సినిమా మీద ఇంత పెట్టడం ఏంటి?

ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్లు ఉండడంతో పాటు హిందూ పౌరాణిక కథ కావడంతో ఈసారి బడ్జెట్ వెనక్కి వచ్చేస్తుందని గట్టి నమ్మకంతో ఉంది మంచు ఫ్యామిలీ. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయావి. ‘కన్నప్ప’ సినిమా మొత్తం ఫుటేజీ 52 గంటలకు పైగా ఉందని, అయితే దాన్ని కత్తిరించి 3 గంటలకు తీసుకొచ్చారని ఓ వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Kannappa Movie : విష్ణు ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలయ్య..

సాధారణంగా ఎడిటింగ్‌కి వచ్చే ఫైనల్ ఫుటేజ్ 5 గంటల వరకూ ఉంటుంది. అందుకే అనవసర షాట్స్ అన్నీ కత్తిరించేసి, కథకు అడ్డం పడుతున్నాయని అనుకునే సీన్స్ కూడా కత్తిరించి రెండున్నర గంటల నుంచి 3 గంటల మధ్య సెటిల్ అవుతారు. అయితే ఈ సినిమా ఫుటేజీ 52 గంటలు వచ్చిందనేది కేవలం మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి సృష్టించిన మీమ్ వార్త మాత్రమే. ఈ సినిమా టీజర్‌పైన ట్రోల్స్ బాగా వస్తున్నాయి. మరి ఇలాంటి ట్రోలింగ్‌ని తట్టుకుని, ‘కన్నప్ప’ హిట్టు కావాలంటే ఆ శివుడే కాపాడాలి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post