Kannappa Movie : విష్ణు ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలయ్య..

Kannappa Movie
Kannappa Movie

Kannappa Movie : మంచు విష్ణువర్థన్ బాబు, రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా ‘కన్నప్ప’. న్యూజిలాండ్‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహాశివుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అయితే ఈ పాత్ర కోసం తొలుత నందమూరి బాలకృష్ణను అనుకున్నారట. ‘అఖండ’ సినిమాలో అగోరా పాత్రలో కనిపించిన నందమూరి బాలకృష్ణ, ఆ సమయంలో ఏపీ పాలిటిక్స్‌తో యమ బిజీగా ఉండడంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పేశాడట. నందమూరి ఫ్యామిలీకి, మంచు మోహన్‌బాబుకి మంచి రిలేషన్ ఉంది..

Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ సినిమాలో మోహన్ బాబు, యముడిగా నటించాడు. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ కీ రోల్ చేశాడు. అయితే డేట్స్ సర్దుబాటు కాక, ‘కన్నప్ప’ సినిమాలో నటించలేకపోయాడు బాలయ్య. దీంతో ‘ఓ మై గాడ్’ సినిమాలో దేవుడిగా నటించిన అక్షయ్ కుమార్‌ని సంప్రదించింది చిత్ర యూనిట్..

ఈ సినిమా కోసం 4 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిన అక్షయ్ కుమార్ రూ.6 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. ప్రభాస్ మాత్రం ఈ సినిమాని ఫ్రీగా చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ అలా మెరిసి ఇలా మాయం అవుతాడని, రెండు రోజుల కాల్షీట్‌లో షూటింగ్ కంప్లీట్ చేశాడని అంటున్నారు. కైలాసంలో మహాశివుడిగా అక్షయ్ కుమార్ కనిపిస్తుంటే, భూలోకంలో మానవరూపంలో మారే పరమశివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడని అంటున్నారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post