Kannada Language Row : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీలో ‘ప్రాంతీయాభిమానం’ పేరుతో తెలుగు రాష్ట్రంలో సెటిలైన పరాయి రాష్ట్ర వ్యాపారవేత్తలపై దాడులు చేస్తారు. ప్రస్తుతం బెంగళూరులో అచ్చు ఇలాంటి సీన్సే రిపీట్ అవుతున్నాయి.
రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు రాదు! ఎన్ని ఎకరాలున్నా ఇస్తామంటూనే..
బెంగుళూరులోని హోటళ్లు, రెస్టారెంట్ల బోర్డులపై ఇంగ్లీష్, హిందీలో పేర్లు ఉంటాయి. గ్లోబల్ సిటీగా మారిన బెంగళూరులో కన్నడీగులు మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది బతుకుతెరువు కోసం వచ్చి జీవనం సాగిస్తున్నారు. బెంగళూరులో నివసించే కన్నడీగుల కంటే తెలుగువాళ్లు, కేరళ వాళ్లే ఎక్కువ..
హిజాబ్ పై కర్ణాటక ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు..
అయితే కొందరు కన్నడ సంఘాల కార్యకర్తలు, బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్ల బోర్డులపై ఇంగ్లీష్, హిందీలో పేర్లు ఉండడాన్ని నిరసిస్తూ దాడులకు పాల్పడ్డారు. ఈ కారణంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నడలో చాలా మంది ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, బెంగళూరులో ఉన్న నాన్ లోకల్ జనాలు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడడాన్ని తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. బెంగళూరుకి ఎవ్వరు వచ్చినా కన్నడలోనే మాట్లాడాలనే విధంగా మాట్లాడడం కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
#WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0
— ANI (@ANI) December 27, 2023