ఇది మా సినిమా! మా ప్లేస్… ‘సలార్’కి ఛాలెంజ్ చేస్తున్న కన్నడ హీరో దర్శన్..

Kannada Hero Darshan Challenges to Prabhas Salaar Movie : డైనోసార్‌తో పోటీపడలేక స్వయంగా షారుక్ ఖాన్, తన ‘డంకీ’ మూవీని ఒక్కరోజు ముందుకు జరిపాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో వచ్చిన క్రేజ్ అలాంటిది. ‘సలార్’ మూవీ రిలీజ్ అవుతుండడంతో దానికి వారం ముందు, వారం తర్వాత కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ తప్ప, ‘సలార్’ రిలీజ్ తర్వాత సంక్రాంతి వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.

సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..

అయితే కన్నడ హీరో దర్శన్, ‘సలార్’ మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 29న దర్శన్ హీరోగా నటించిన ‘కటేరా’ మూవీ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ… ‘ఇది మా సినిమా, మా ఏరియా. వేరే వాళ్లు ఇక్కడికి వస్తుంటే వాళ్లు బయటపడాలి. నేనెందుకు భయపడాలి.

సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?

మా సినిమా మా ఏరియాలో రిలీజ్ చేయడానికి వేరే వాళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు. కొన్నేళ్ల క్రిందట నటి భవనపై లైంగిక దాడి కేసు సంచలనం రేపింది. ఆ సమయంలో ఆ కేసులో ప్రధాన సూత్రధారిగా వినిపించిందీ ఈ దర్శన్ పేరే.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post