Kannada Actor Darshan : హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్, తాను చంపలేదని, చంపే ఉద్దేశం కూడా లేదని పోలీసుల విచారణలో చెప్పాడు. పవిత్ర గౌడకి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిస్తున్న రేణుకా స్వామిని కొందరు రౌడీలతో కిడ్నాప్ చేయించిన దర్శన్, అతన్ని రెండు రోజులు చిత్రవధ చేసి చంపించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే దర్శన్ మాత్రం ‘నేను ఆ షెడ్డుకి వెళ్ళాను. అతన్ని నుదిటి మీద కొట్టిన మాట నిజమే. కానీ రేణుకా స్వామిని, చంపే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకోసారి ఇలా చేయవద్దని హెచ్చరించాను. భోజనం పెట్టి పంపమని చెప్పాను.
ఇది మా సినిమా! మా ప్లేస్… ‘సలార్’కి ఛాలెంజ్ చేస్తున్న కన్నడ హీరో దర్శన్..
తర్వాత అక్కడి నుంచి త్వరగా వచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియద’ని పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు దర్శన్. పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు పంపిన రేణుకాస్వామిని చిత్రదుర్గ ఏరియా నుంచి దర్శన్ అభిమానులు తీసుకొచ్చారు. అతన్ని మైసూరు రోడ్డులోని పట్టగెరె సమీపంలోని ఓ షెడ్డులో బంధించినట్టుగా పోలీసులు తెలిపారు. ఆరోజు సాయంత్రం కాగానే రేణుకాస్వామిని దర్శన్ ఈడ్చుకెళ్లాడని అభిమానులు తెలిపారు. దర్శన్ ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయాడు.
అనంతరం తిరిగి రాజరాజేశ్వరి నగర్‌లోని ఇంటికి వెళ్లిన దర్శన్, పవిత్రగౌడ్‌ను తీసుకొచ్చి ఆమె ముందు రేణుకాస్వామిని చెంప చెళ్లుమనిపించాడు. తర్వాత మరోసారి ఇలా చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అనంతరం తనకు భోజనం పెట్టి గ్రామానికి పంపాలని బంధువులకు చెప్పి వెళ్లిపోయాడు. అయితే తాగిన మత్తులో తీవ్రఆవేశానికి లోనైన దర్శన్ సన్నిహితులు అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో రేణుకా స్వామి మృతి చెందాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మాగడి రోడ్డులోని సుమనహళ్లి ఫ్లైఓవర్ సమీపంలోని సర్వీస్ రోడ్డుపైకి తోసేశారు.
మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..
హత్యకు గురైన రేణుకాస్వామి శరీరంపై 15 భాగాల్లో గాయాలున్నాయి. రేణుకాస్వామి ముఖం, ఛాతీ, చేతులు, కాళ్లపై దారుణంగా కొట్టారు. చనిపోయిన తర్వాత అతన్ని చెత్త కుప్పలో పడేశారు. దీంతో ఎలుకలు, కుక్కలు అతని మృతదేహాన్ని ముఖాన్ని కొరికినట్టుగా గుర్తులు ఉన్నాయి. మృతదేహాన్ని విసిరేసిన తర్వాత దుండగులు స్వయంగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. విషయం బయటికి రాకుండా ఉండేందుకు కుటుంబ కలహాలు అంటూ అన్నాచెల్లెలు అంటూ ఏదో కథ అల్లే ప్రయత్నం చేశారు. అయితే వారి కథనానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా దర్శన్, పవిత్రగౌడ్ పేర్లు బయటికి వచ్చాయి. దీంతో దర్శన్‌ని అరెస్ట్ చేశారు మైసూర్ పోలీసులు..