Kalki 2898AD Trailer : ‘కల్కి 2898AD’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయితే జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ మొదలెట్టలేదు. ‘సలార్ ’ మూవీ కూడా ఇలాగే ప్రమోషన్స్ చేయకుండా థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ప్రభాస్ బ్రాండ్ బాగానే వర్కవుట్ అయినా, హిందీలో మాత్రం భారీగా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ‘కల్కి’ మూవీకి కూడా ప్రమోషన్స్ ఇంకా చేయడం లేదు నాగ్ అశ్విన్ అండ్ కో..
జూన్ 10న ‘కల్కి 2898AD’ ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ముందు ‘బుజ్జి అండ్ భైరవ’ అంటూ రెండు చిన్న చిన్న యానిమేషన్ ఎపిసోడ్స్ వచ్చాయి. వాటి వల్ల సినిమాకి కాస్తో కూస్తో హైప్ పెరిగింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఉన్న హైప్ కాస్తా పడిపోయింది. నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ మూవీ తీస్తున్నాడని జనాలకు అర్థమైంది. కానీ ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ, సాధారణ తెలుగు ఆడియెన్స్‌కి ఎంత వరకూ అర్థమవుతుంది? ఇదే సమస్య..
Kalki 2898AD Hollywood Movie : హాలీవుడ్ రేంజ్ బొమ్మ! అసలు సమస్య అక్కడే…
హాలీవుడ్ సినిమాలు మనవాళ్లు చూస్తారు కదా.. తెలుగులో కూడా రికార్డు కలెక్షన్లు వస్తాయి కదా.. అనుకోవచ్చు. కానీ హాలీవుడ్ సినిమాల్లో తెలుగులో బాగా ఆడే సినిమాలను గమనిస్తే.. సూపర్ హీరో సినిమాలైనా అయ్యుండాలి లేదా యానిమేషన్, గ్రాఫిక్స్ ఉన్న సినిమాలైనా అయ్యుండాలి. బాగా తెలివి వాడాల్సిన సినిమాలు, తెలుగు జనాలకు ఎక్కువు. ‘ఓపెన్‌హైమర్’ లాంటి సినిమాలకు వెళ్తే, బోర్ కొట్టి వచ్చేస్తారు.
ఇప్పుడు ట్రైలర్ చూస్తే బాగా డల్‌గా, ఎక్కడా ఉత్సాహం, జోష్ లేనట్టుగా నిరసంగా సాగింది. అక్కడక్కడా ప్రభాస్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ పెట్టినా నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌ని కూడా ఈ ట్రైలర్ పూర్తిగా సంతోషం పెట్టలేదు. మరి ఇన్ని కోట్లు పెట్టి, తీసిన ‘కల్కి’ తెలుగు జనాలకు ఎక్కుతుందా? ఇప్పుడు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ తెగ వర్రీ అవుతున్న విషయం ఇదే..