Kalki 2898AD Movie Twist : గాంఢీవం ఎత్తిన సుప్రీమ్ యాస్కిన్, అర్జునుడి రూపమా? ఇదేం ట్విస్టురా బాబూ..

Kalki 2898AD Movie Twist
Supreme Yaskin

Kalki 2898AD Movie Twist : కల్కి 2898AD సినిమా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేస్తోంది. అలాగే ఈ సినిమా కారణంగా కొన్ని తరాల తర్వాత పురాణాల గురించి చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం అర్జునుడు గొప్పా? లేక కర్ణుడు గొప్పా? అనే విషయం మీద సోషల్ మీడియాలో కొట్టుకున్నారు జనాలు. ఇప్పుడు కల్కి క్లైమాక్స్ మీద పెద్ద చర్చ నడుస్తోంది. కల్కి 2898AD క్లైమాక్స్‌లో ప్రభాస్‌ని కర్ణుడి మరో జన్మ అంటూ రివిల్ చేశారు.

టైటిల్స్ కార్డ్స్ పడిన తర్వాత కురుక్షేత్రంలో అర్జునుడు వాడిన గాంఢీవాన్ని ఎత్తి, సుప్రీమ్ యాస్కిన్.. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం డైలాగులు చెబుతాడు. ఇక్కడే ఓ డౌట్ పుడుతోంది. కురుక్షేత్రంలో కౌరవుల తరుపున యుద్ధం చేసిన కర్ణుడు, అశ్వత్థామ.. కలి యుగంలో మంచి వైపు యుద్ధం చేస్తున్నారు. మరి గాంఢీవం ఎత్తిన సుప్రీమ్ యాస్కిన్ ఎవరు? అర్జునుడి మరో జన్మ అవతారమా?

Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!

గాంఢీవం ఎత్తడం ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదే చెప్పాలనుకున్నాడా? ద్వాపర యుగంలో మంచి వైపు నిలబడిన అర్జునుడు, కలి యుగంలో కలిపురుషుడుగా మారతాడా? లేక కేవలం సుప్రీమ్ యాస్కిన్‌కి ఎంత బలం ఉందో చెప్పడానికి మాత్రమే గాంఢీవాన్ని బయటికి తీసి, దాన్ని ఎక్కిపెట్టినట్టు చూపించాడా? పార్ట్ 2 విడుదల అయితే కానీ తెలీదు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post