Kalki 2898AD Movie: ఉన్నది 2 వారాలే, బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..

Kalki 2898AD
Kalki 2898AD

Kalki 2898AD Movie: ప్రభాస్ మూవీ ‘కల్కి’ బడ్జెట్ రూ.700 కోట్లు. అందులో సగం ఓటీటీ డీల్స్ ద్వారా వచ్చేసినా ఇంకా కనీసం రూ.400 కోట్లు వస్తే కానీ హిట్టు కింద లెక్క కాదు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పాటు ఇంకా ఎంతోమంది స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. కానీ ఓపెనింగ్స్ రూపంలోనే రూ.150 కోట్లు ఈజీగా రాబడుతుంది ‘కల్కి 2898AD’..

హిందీలో కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ప్రభాస్ మూవీకి ఓపెనింగ్స్ అదిరిపోవచ్చు. ప్రమోషన్స్ చేయకపోయినా ప్రభాస్ కటౌట్‌తో వసూళ్లు వచ్చేస్తాయి. అయితే ప్రభాస్ మూవీకి ఉన్నది 2 వారాల గ్యాప్ మాత్రమే. ప్రభాస్ సినిమా వస్తుండడంతో ఈ వారం మీడియం రేంజ్ సినిమాలేవీ రాలేదు… కల్కి తర్వాత వారం కూడా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.. అయితే జూలై 12న కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్ అవుతోంది..

Kalki 2898AD Movie : మరోసారి తెలుగువారిపై అక్కసు.. ఈ అరవోళ్లు మారరా..

అప్పుడెప్పుడో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో కమల్ హాసన్‌కి మంచి మార్కెట్ ఉంది. తెలుగులో ప్రభాస్ సినిమాకి ‘భారతీయుడు 2’ పోటీ కాకపోవచ్చు కానీ హిందీ, తమిళ భాషల్లో మాత్రం కచ్ఛితంగా పోటీ ఇస్తుంది. కాబట్టి ప్రభాస్ రెండు వారాల గ్యాప్‌లో ఎంత ఎక్కువ వసూలు చేయగలిగితే అంత సేఫ్ అవ్వొచ్చు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post