Kalki 2898AD Movie Collections : ప్రభాస్ నటించిన కల్కి 2898AD మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 12 రోజుల్లో రూ.80 కోట్లకు పైగా లాభాలు సంపాదించింది. నార్త్ అమెరికా, యూఎస్‌లో 16.5 మిలియన్లు సాధించిన కల్కి 2898AD మూవీ, ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు మరో 1.2 మిలియన్ డాలర్లు సాధిస్తే చాలు.. అయితే ‘బాహుబలి 2’ రికార్డును అందుకోవాలంటే ఇంకో 7 మిలియన్లు అందుకోవాల్సి ఉంటుంది..
కల్కి 2898AD విషయంలో దర్శక నిర్మాతలు చేసిన ఓ తప్పిదం వల్ల దాదాపు రూ.200 కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్.. ‘సాహో’, ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలకు కూడా రిలీజ్‌కి ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. ప్రమోషన్స్ కారణంగా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుని, భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి ఈ సినిమాలు..
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
అయితే ఈ మూడు సినిమాల రిజల్ట్ కారణంగా ప్రమోషన్స్ చేయడం మానేశాడు ప్రభాస్. ఈ కారణంగా ‘సలార్’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, లాభాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇప్పుడు ‘బాహుబలి 2’ రేంజ్ అవుట్‌పుట్, కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ‘కల్కి 2898AD’ కలెక్షన్లు, ‘బాహుబలి 2’కి చాలా దూరంలో ఉన్నాయి..
ముఖ్యంగా ‘బాహుబలి 2’ రిలీజ్‌కి ముందు రెండు నెలలు, రిలీజ్ తర్వాత మరో 15 రోజులు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడ్డారు రాజమౌళి, ప్రభాస్.. బాలీవుడ్‌లో అన్ని టీవీ షోలకు వెళ్లారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రమోషన్స్ గట్టిగా చేశారు. ఈ కారణంగానే సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ‘కల్కి 2898AD’ టీమ్, అస్సలు బాలీవుడ్‌లో ఏ మాత్రం ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ప్రభాస్ బ్రాండ్‌ని నమ్ముకుని సినిమాని దింపింది..
Kalki 2898AD Movie Twist : గాంఢీవం ఎత్తిన సుప్రీమ్ యాస్కిన్, అర్జునుడి రూపమా? ఇదేం ట్విస్టురా బాబూ..
ప్రమోషన్స్ కారణంగా మొదటి 2 వారాల్లో ‘బాహుబలి 2’ మూవీ హిందీ నుంచే రూ.500 కోట్లు తెచ్చింది. ‘కల్కి 2898AD’ ఇప్పటికీ రూ.250 కోట్ల క్లబ్‌కి చేరలేదు. ఫుల్ రన్‌లో కల్కి హిందీలో రూ.300 కోట్లు వసూలు చేసినా కూడా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల దాదాపు రూ.200 కోట్లు నష్టపోయినట్టే..