Kalki 2898AD Movie Collections : కల్కి కలెక్షన్ల సునామీ..

Kalki 2898AD Movie Collections
Kalki 2898AD Movie Collections

Kalki 2898AD Movie Collections : ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. 5 రోజుల్లో రూ.625 కోట్లు వసూలు చేసింది ‘కల్కి 2898AD’ సినిమా. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ని రూ.385 కోట్లకు విక్రయించారు. అయితే మొదటి వారంలోనే ఈ వసూళ్లను దాటేసేలా కనిపిస్తోంది ‘కల్కి 2898AD’.

ఇప్పటికే కేరళ రాష్ట్రంలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కల్కి 2898AD’ మూవీ, నార్త్ అమెరికాలో అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో 20 మిలియన్ డాలర్ల మార్కు దాటేసిన ‘కల్కి 2898AD’ మూవీ, అక్కడి నుంచే రూ.150 కోట్లకు పైగా రాబట్టింది.. హిందీలో రూ.130 కోట్లు వసూలు చేసిన ‘కల్కి 2898AD’ మూవీ, తమిళ్ డబ్బింగ్ వర్షన్ కూడా మంచి వసూళ్లతో బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది.

Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!

ప్రమోషన్స్‌కి పెద్దగా ప్రచారం చేయకపోయినా, మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూ పోతున్నాయి. తెలంగాణతో పాటు ఓవర్‌సీస్, కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించనుంది. అయితే సీడెడ్‌లో మాత్రం ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకో వారానికి పైగా సమయం పట్టనుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post