Kalki 2898AD Hollywood Movie : ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898AD ’. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం అయితే మే 9న విడుదల కావాల్సింది. ఎన్నికల కారణంగా ఈ సినిమాని జూన్ 27కి వాయిదా వేశారు. తాజాగా ‘బుజ్జి’ అంటూ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుని పరిచయం చేస్తూ 50 సెకన్ల విడుదలను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియో చూసిన అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యింది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ బొమ్మరా.. అనిపిస్తోంది. అయితే ఇదే ఇక్కడ ప్రధాన సమస్య..
‘సాహో’ సినిమాలో కథ, కథనం మాస్ జనాలకు అర్థం కాలేదు. మూడు తెగలు, ఆ తెగలకు నాయకులు, వారసులు, రాజ్యం.. అంతా ఓ గజిబిజి ఫజిల్‌లా అనిపించింది. కేవలం ప్రభాస్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ చూడడానికే చాలామంది థియేటర్లకు వెళ్లారు. మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ కాకపోవడం వల్లే పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ‘సలార్ పార్ట్ 1’ మూవీ, లాభాలు తేలేకపోయింది. ఇప్పుడు ‘కల్కి 2898AD’ విషయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఇదే ప్రశ్న వెంటాడుతోంది..
అంతరిక్షం నుంచి ఓ కారు రావడం, ఇక్కడి హీరోతో కనెక్ట్ కావడం, విష్ణు మూర్తి అవతరాలు, కల్కికి సాయంగా వచ్చే మృత్యుంజయులు, వారి కథ.. ఇవన్నీ బీ, సీ సెంటర్లలో అభిమానులకు ఎంత వరకూ కనెక్ట్ అవుతాయనేదే ఇక్కడ మిస్టరీ.. కథా బలం ఉన్నా సరే, కొన్ని సినిమాలు మాస్‌కి కనెక్ట్ కాకపోతే భారీ వసూళ్లు రాబట్టలేవు. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాలు అటు క్లాస్‌కి, ఇటు మాస్‌కి కనెక్ట్ కావడం వల్లే వేల కోట్ల వసూళ్లు సాధించాయి. ఇదే సమయంలో మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వమ్’ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. కారణం అందులో కథ, కథనాలు ఉన్నా.. మాస్ ఆడియెన్స్‌కి అవి కనెక్ట్ కాలేదు.
‘రొబో’ మూవీలా ఫైట్స్, కామెడీ, సీన్స్ జనాలకు కనెక్ట్ అయితే సైన్స్, శాస్త్రాలు ఇవేమీ పట్టించుకోరు జనాలు. నాగ్ అశ్విన్ ఆ విధంగా సక్సెస్ అవుతాడా? లేక హాలీవుడ్ రేంజ్ బొమ్మ తీసినా, కేవలం క్లాస్ ఆడియెన్స్ అనే ట్యాగ్ పడేలా చేస్తాడా? తెలియాలంటే ఇంకో నెల రోజులు ఆగాల్సిందే..