Kalki 2898AD Benefit Shows : నో బెనిఫిట్ షోస్.. ఆ మూవీ దెబ్బతో తగ్గిన డార్లింగ్..

Kalki 2898AD Benefit Shows
Kalki 2898AD Benefit Shows

Kalki 2898AD Benefit Shows : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ మరో వారంలో రిలీజ్ అవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘కల్కి’ మూవీకి సరైన ప్రమోషన్స్ అయితే జరగడం లేదు. ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, అన్ని ఏరియాల్లో లాభాలు రాలేదు. దీనికి కారణం సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడమే. కేవలం ప్రభాస్ బ్రాండ్‌ని నమ్ముకుని వచ్చిన ఆ సినిమా, బాలీవుడ్‌లో నష్టాలు మిగిల్చిది.

ఏపీలో ప్రభుత్వం మారడంతో ‘కల్కి’ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడికి నిర్మాత అశ్వినీదత్, ఆప్తుడు కావడంతో అదనపు షోస్ కూడా చేరబోతున్నాయి. మొదటి 3 రోజుల పాటు రోజుకి 5 షోస్ పడే అవకాశం ఉంది. అయితే రిలీజ్ రోజు మిడ్‌నైట్ షో మాత్రం వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు..

Kalki 2898AD Trailer : మన జనాలకు ఎక్కుతుందా?

గుంటూర్ కారం’ మిడ్ నైట్ షో కారణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ‘సలార్’ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ వచ్చింది. అర్ధరాత్రి షో వేయడం వల్ల వచ్చినవాళ్లలో చాలామంది నిద్ర ఆపుకుంటూ సినిమా చూడడం వల్లే ఇలా జరుగుతోందని గుర్తించారు. అందుకే తెలంగాణలో బెనిఫిట్ షోస్ వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే అమలు చేయబోతున్నారు. జూన్ 27న రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ థియేటర్‌లో ‘కల్కి 2898AD’ సినిమా ఆడేలా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post