Kalki 2898 AD Vs Mad Max : ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ రూ.600 కోట్లు పెట్టి తీసిన ‘కల్కి 2898AD’ మూవీ, హాలీవుడ్‌లో వచ్చిన ‘MadMax Fury road’ మూవీకి ఫ్రీమేకా? ఈ రకమైన పోలికలు రావడానికి కారణాలు ఉన్నాయి.
కల్కి సినిమాలో మంచి నీరు కోసం, గాలి కోసం హీరో ఎన్నో తప్పులు చేసి అన్నీ సమృద్ధిగా దొరికే చోటుకి వెళ్ళడానికి డబ్బులు కూడా బెడతాడు.
పైన వేటికోసమైతే హీరో ప్రయత్నం చేస్తాడో ‘Madmax’ సినిమాలో కూడా వాటి కోసమే ఒకరిని ఒకరు చంపుకుంటారు.
Mad Max లో దేవుడిగా పిలవబడే వ్యక్తి.. మంచి ఆరోగ్యవంతుడైన వారసుడు కావాలనీ, అందుకోసం కొంతమంది అమ్మాయిలను ఎంచుకుని వాళ్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ తన భార్యలుగా.. అంటే పిల్లలను కనే యంత్రం లాగా మార్చుకుంటాడు. ఒకవేళ పిల్లలు సరిగా పుట్టకపోయినా, ఆ తల్లి పాలను సైతం మెషిన్స్ సాయంతో ఆహారంగా వాడుకుంటాడు.
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
ఇక కల్కి విషయానికి వస్తే..
కల్కి సినిమాలో విలన్ కమల్ హాసన్. అతను (సుప్రీం) హెల్తీగా.. అంటే యవ్వనంగా మారడానికి అమ్మాయిలను ల్యాబ్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తాడు అయితే పిల్లలు కడుపులో 120 రోజులకు మించి ఉండరు. అలాంటి వాళ్ళ నుంచి తీసిన ఒక లిక్విడ్ కమల్ హాసన్ కి ఇన్సూలిన్ లేదా ఆహారంలాగా ఎక్కిస్తారు.
ఇలా Mad Max సినిమాకి ప్రభాస్ కల్కి సినిమాకి ఎన్నో పోలికలు ఉన్నా స్క్రీన్ ప్లే మ్యాచ్ కాకూడదని నాగశ్విన్ తీసుకున్న జాగ్రత్తలు కల్కి సినిమా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది.
అణుయుద్ధంతో అంతరించుకుపోతున్న ప్రపంచంలో చివరిగా మిగిలిన కాశీ నగరం, అక్కడ ఉండే జనం పడే తిప్పలు ముందు చూపించి ఉంటే బాగుండు. ఎంత టెక్నాలజీ, తారగణం ఉన్నప్పటికీ థియేటర్ లో జనం 40 నిముషాలు.. అంటే అమితాబ్ వచ్చేవరకు నిప్పుల మీద కూర్చున్నట్టు ఉండకుండా ఉండేది.
Mad Max మూవీకి మ్యాచ్ అవ్వకూడదు అనుకున్నంత వరకు బాగానే ఉంది.
హీరో కాబట్టి దిట్టంగా ఉండటం బాగానే ఉంది. అయితే హీరో డైలాగ్స్ లో తప్ప అక్కడి ప్రజలు ఆహారం దొరక్క, తాగడానికి నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు ఎక్కడ చూపించలేదు.
Deepika Padukone : ‘కల్కి’కి ప్రాణం పోసిన దీపికా.. ఫిదా అవుతున్న జనాలు..
అప్పటి పరిస్థితిని ప్రేక్షకుల మనసులో ముద్ర వెయ్యడంలో విఫలం అయ్యాడు డైరెక్టర్ నాగశ్విన్. సినిమాలో స్క్రీన్ ప్లే అసలైన హీరో. దీన్ని ఇండియన్ మూవీస్ లో తక్కువ శాతమే గుర్తిస్తారు. మనకి ఎంతసేపూ హీరో గాల్లో ఎగిరి విలన్ని తన్నాలి. తొడ గొడితే సుమోలు ఎగరాలి. దానికే మన ఈలలు, గోలలు..
కల్కి సినిమా స్క్రీన్ ప్లే విషయంలో నాగశ్విన్ ఎంచుకున్న మెయిన్ పాయింట్లో ఎక్కడా కింగ్ సినిమాలో శ్రీహరి వేసిన బొమ్మలో ఉన్నంత దీనత్వం కనిపించలేదు.
జేమ్స్ కామెరూన్ సినిమాల్లోనే మిస్టేక్స్ ఉంటాయి. అలాంటిది నాగ్ అశ్విన్ సినిమాలో తప్పులు, లాజిక్ లేని మ్యాజిక్స్ ఉండడంలో తప్పు లేదు. కానీ ఇకపైన అయినా అశ్విన్ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. చాలా రోజులకి సలార్ రూపంలో హిట్ పడితే.. కల్కీ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ పడి బాక్సాఫీస్ ని ప్రభాస్ ఊచకోత కోస్తూ.. ఇటు రెబల్ ఫ్యాన్స్ కి, పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు.
Kalki 2898AD Movie Review : బాహుబలి రేంజ్ హిట్టు కొట్టేసిన ప్రభాస్..