kajal aggarwa : 17 ఏళ్లుగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కాజల్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్, రామ్ వంటి యంగ్ హీరోలందరితో సినిమాలు చేసింది. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి సీనియర్లతో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ మూవీలో కమల్ హాసన్‌తో నటిస్తున్న కాజల్ అగర్వాల్, ‘సత్యభామ’ అనే మరో సినిమాలో ఏసీపీగా కనిపించనుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎదురైన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది కాజల్ అగర్వాల్. ‘నేను, ఓ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చాను. ఆ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్, సడెన్‌గా నా వానిటీ వ్యాన్‌లోకి వచ్చాడు. వస్తూనే తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలెట్టాడు. నాకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయమేసింది. అయితే షర్టు తీసి, తన గుండెల మీద వేసుకున్న నా పేరు టాటూని చూపించాడు. అతని అభిమానం చూసి సంతోషం వేసినా, అతను చేసిన పనికి భయమేసింది. ఇకపై ఎప్పుడూ అలా చేయకని చెప్పి పంపించేశాను..’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్..
తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్, 2020లో గౌతమ్ కిచులు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి 2022లో ఓ బాబు పుట్టాడు. కొంతకాలం సినిమాలకు, షూటింగ్స్‌కి దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్, 2023 నుంచి మళ్లీ సినిమాలు చేస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ (kajal Aggarwal) నటించినా, ఎడిటింగ్‌లో ఆమె పాత్రను పూర్తిగా కట్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ కావడం వల్లే కాజల్ అగర్వాల్‌కి మంచే జరిగినట్టు అయ్యింది.