KA Paul : ఏపీ ఎన్నికలు ముగిశాయి. అధికార వైసీపీ అన్యూహ్యాంగా 11 సీట్లకు పరిమితం అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు సాధించి ఘన విజయం అందుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా శాంతి పార్టీ కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వైజాగ్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, తన 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని చాలా సార్లు చెప్పాడు. అయితే రిజల్ట్ మాత్రం వేరేలా వచ్చింది. మొత్తంగా 3236 ఓట్లు మాత్రమే సాధించిన కేఏ పాల్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు..
Pawan Kalyan : అవి మనకెందుకంటే, మడిచి పెట్టుకో అన్నాడు..
చాలా పోలింగ్ కేంద్రాల్లో కేఏ పాల్‌కి ఒక్క ఓటు కూడా రాలేదు. అయితే మురళీనగర్ పోలింగ్ కేంద్రంలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కేఏ పాల్. ‘మురళీనగర్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 22 మంది ఉన్నారు. వాళ్లంతా నాకే ఓటు వేశారు. అయితే కౌంటింగ్‌లో వచ్చింది మాత్రం నాలుగంటే నాలుగు ఓట్లు మాత్రమే… ఈవీఎం ట్యాంపరింగ్‌లు చేసి, నాకు రావాల్సిన ఓట్లను వేరే పార్టీకి పంపించారు..’ అన్నాడు కేఏ పాల్..
Telangana New Logo : అవసరమా? అధికార దర్పమా..!?
ప్రజాశాంతి పార్టీ 2009 ఎన్నికల్లో మొత్తంగా 294 స్థానాల్లో పోటీ చేసినప్పుడు మొత్తంగా 0.01 శాతం ఓట్లు మాత్రమే సాధించింది 2019 ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ, స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకుని 0.04 శాతం ఓట్లు సాధించింది. ఈసారి ఆ లెక్క మరింత పెరిగినట్టు తెలుస్తోంది.