Jr NTR Vs Balakrishna : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీల పంచాయితీ.. అబ్బాయి తారక్ ఫ్లెక్సీలు తీయించిన బాబాయ్ బాలయ్య..

Jr NTR Vs Balakrishna
Jr NTR Vs Balakrishna

Jr NTR Vs Balakrishna : నందమూరి కుటుంబాలు కొత్తేమీ కాదు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కూతుర్లు కొట్టుకున్నారు. ఇప్పుడు ఆ గొడవలు మనవళ్ల దాకా వచ్చాయి. మూడో తరంలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. కుటుంబం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా స్వంతంగా సినిమాలు చేసుకుంటూ, గ్లోబల్ యాక్టర్‌గా ఎదిగాడు. తాత తారక రాముడి జయంతికి, వర్థంతికి ఆయన సమాధిని దర్శించుకుని, స్మరించుకోవడం ఎన్టీఆర్‌కి అలవాటు.

Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..

ఆరంభంలో ఒంటరిగా వచ్చిన ఎన్టీఆర్, కొన్నేళ్లుగా అన్న కళ్యాణ్‌రామ్‌తో పాటు వస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌కి స్వాగతం పలికేందుకు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు. వీటిని చూసిన నందమూరి బాలకృష్ణ, వాటిని వెంటనే తీసేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్‌ కోసం పెట్టిన ఫ్లెక్సీల్లో తాత తారక రాముడు, తండ్రి హరికృష్ణ, అన్న కళ్యాణ్ రామ్ పోస్టర్లు ఉన్నాయి కానీ నందమూరి బాలకృష్ణ ఫోటో లేదు. అందుకే బాలయ్య ఫీలై ఉంటాడని కొందరు అంటుంటే, అన్న కొడుకు అందనంత ఎత్తుకు ఎదగడం బాబాయ్ బాలయ్య తట్టుకోలేకపోతున్నాడని మరికొందరు అంటున్నారు.

Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

అయితే ఎన్టీఆర్ స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం బాలయ్య చర్యను తీవ్రంగా ఖండించాడు. బాలకృష్ణ ,చంద్రబాబు లాంటివాళ్లు, వెయ్యి మంది కలిసి వచ్చినా, ఎన్టీఆర్‌ను ఏమీ చెయ్యలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు కొడాలి నాని.. ఎప్పట్లాగే ఈ విషయంపై కూడా స్పందించలేదు తారక్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post