Jr NTR – TDP : 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రథ సారథిగా మారి, ప్రచారంలో దూసుకుపోయాడు ఎన్టీ రామారావు జూనియర్. తాతకు తగ్గ మనవడిలా ఎన్టీఆర్ ప్రచారంలో ఇచ్చిన ఉపన్యాసాలు చూసి, తెలుగువాళ్లు షాక్ అయ్యారు. ఎన్టీఆర్‌కి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని అప్పుడే ఫిక్స్ అయిపోయింది. నందమూరి ఫ్యామిలీ ఎంత దూరం పెట్టినా, తెలుగుదేశం భవిష్యత్తు తారకే అంటారు తెలుగు అభిమానులు.. కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు..
Manamey Pre-release Event : పిఠాపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..
ఎన్టీఆర్‌కి విచిత్రమైన సలహా ఇచ్చాడు పిఠాపురం తెలుగుదేశం నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ. ‘ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే యాక్టింగ్ మానేయాలి.. యాక్టింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసి మా పార్టీలో జాయిన్ అయితే, అతని పొజిషన్‌ని మేం డిసైడ్ చేస్తాం.. రాజకీయాల్లోకి వచ్చాక నటిస్తానంటే మాత్రం ఒప్పుకోం.. ’ అన్నాడు వర్మ.. వర్మ వ్యాఖ్యలపై జనాలు వేరేలా స్పందిస్తున్నారు..
ఎన్టీఆర్‌ని యాక్టింగ్ మానేయాలని సలహా ఇచ్చిన వర్మ, పిఠాపురంలో తన ఎమ్మెల్యే సీటును లాక్కున్న పవన్ కళ్యాణ్‌కి ఎందుకు ఈ సలహా ఇవ్వలేకపోయాడని కొందరు అంటుంటే.. అతనికి దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరికి ఈ మాట చెప్పాలని మరికొందరు అంటున్నారు. అయినా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే కదా.. ఈ డిస్కర్షన్ అంతా? ఇప్పుడు ఎందుకు ఈ అనవసర రచ్చ చేసి, తారక్‌ని సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారనేవాళ్లు లేకపోలేదు.. ప్రత్యేక్ష రాజకీయాల్లో ఉన్నా, లేకపోయినా ఎన్టీఆర్ ఎప్పుడూ ఏపీ పాలిటిక్స్‌లో కీ ప్లేయర్‌గానే మారుతున్నాడు..