Jr NTR : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం అందుకుంది. ఐదేళ్లు పాలించిన వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కాగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం అందుకుంది. తెలుగుదేశం కూటమి 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతోంది. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్, ఈ ఎన్నికల తర్వాత సోషల్ మీడియా ద్వారా స్పందించాడు..
‘ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ గారికి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా భరత్‌కి, పురదేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్..
Jr NTR – TDP : యాక్టింగ్ మానేసి, రాజకీయాల్లోకి రావాలి.. ఎన్టీఆర్‌కి టీడీపీ నేత సలహా..
మామయ్య, బాబాయ్, అత్త.. అని అప్యాయంగా విషెస్ చెప్పినా కూడా ఎన్టీఆర్ ట్వీట్‌కి ఒక్కరు కూడా స్పందించలేదు. కావాలనే సోషల్ మీడియాలో కూడా నందమూరి, నారా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ని దూరం పెట్టిందని కొందరు అంటున్నారు. అయితే ఊహించని విజయంతో సెలబ్రేషన్స్‌లో ఉన్న వీరంతా మెల్లిగా సోషల్ మీడియా చూసుకుని, తారక్ ట్వీట్‌పై త్వరలోనే స్పందించే అవకాశం ఉంది..