చిరుతలా పెరుగెడుతున్న యంగ్ టైగర్..

Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళకే ఏ రేంజ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. RRR మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అయితే RRR తర్వాత 1 Year ఎలాంటి షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉన్న జూనియర్ ఒక్కసారిగా వేగం పెంచాడు.

ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..

ప్రస్తుతం యంగ్ టైగర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర’ (Devara) మూవీలో నటిస్తున్నాడు. సోషల్ కంటెంట్ కి కమర్షియల్ అంశాలు జోడించడం కొరటాల స్పెషల్. ఇంతకు ముందే జూనియర్, కొరటాల కాంబోలో ‘జనతా గ్యారేజ్’ రాగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం తెలిసిందే. దీంతో దేవరపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలున్నాయి. అలాగే దేవరతో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) టాలీవుడ్ (Tollywood)కి పరిచయం కానుంది.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఈ చిత్రంలో విలన్ గా కనిపించనుండగా, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఇందులో జాన్వీ కపూర్ తండ్రిగా నటిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్‌ (Vishwak Sen) ఈ మూవీలో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో కనిపించనున్నాడు. మొత్తానికి దేవర టీం కాస్టింగ్ తోనే ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రం రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతుంది.

Jr NTR
Jr NTR, Koratala Shiva

కొరటాల శివతో దేవర మూవీ షూట్ కి చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్.. వన్స్ సెట్స్ మీదకు వెళ్ళగానే ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నెలలో రెండుసార్లు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసింది టీం. బేగంపేట, రామోజీ ఫిల్మ్ సిటీలలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర అనంతరం శంషాబాద్ లో షూటింగ్ జరిగింది. దేవర కోసం ఏకంగా సముద్రాన్నే (సముద్రం సెట్) హైదరాబాద్ కు తెచ్చారు. ఇటీవల గోవాలో షూట్ పూర్తి చేసుకున్న దేవర, మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించింది.

ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..

అలాగే మళ్లీ త్వరలో వైజాగ్ షూట్ ప్లాన్ చేసింది దేవర టీం. అయితే రాత్రి, పగలు దేవర షూట్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ డెడికేషన్ కి ఫ్యాన్స్.. మీ స్పీడు కి హాట్స్ ఆఫ్, మీ హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. దేవర షూటింగ్ లో చిరుతలా పెరుగెడుతున్న యంగ్ టైగర్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

2024 ఏప్రిల్ 5న బాక్సాఫీసు స్ట్రోమ్ గ్యారెంటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొరటాల ఫుల్ స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్లడంతోనే షూటింగ్ పక్కాగా ముందుకెళ్తుందంటున్నారు. మొత్తానికి దేవర యూనిట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ 9 నుంచి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post